iDreamPost
android-app
ios-app

బ్రో నిర్మాతలకు నిల్లు.. ప్యాకేజీ స్టార్ పాకెట్ ఫుల్లు! మంత్రి అంబటి ట్వీట్!

  • Author ajaykrishna Published - 12:26 PM, Tue - 1 August 23
  • Author ajaykrishna Published - 12:26 PM, Tue - 1 August 23
బ్రో నిర్మాతలకు నిల్లు.. ప్యాకేజీ స్టార్ పాకెట్ ఫుల్లు! మంత్రి అంబటి ట్వీట్!

ఇటీవల విడుదలైన ‘బ్రో’ మూవీ కలెక్షన్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను.. నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించాడు. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. మొదటి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసినప్పటికీ.. రెండో రోజు నుండి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. దీంతో బ్రో సినిమా కలెక్షన్స్.. పొలిటికల్ కామెంట్స్ కు దారితీసాయి. సినిమాలు, రాజకీయాలు వేరే అయినా.. సినిమాలో శ్యాంబాబు అనే పాత్రలో నటుడు, కమెడియన్ పృథ్వీ చేసిన డ్యాన్స్ చాలా వైరల్ అయ్యింది. ఆ డ్యాన్స్ వీడియో పెద్ద దుమారమే రేపింది.

ఇక ఆ డ్యాన్స్ వీడియో అచ్చంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి ఫెస్టివల్ కి చేసిన డ్యాన్స్ తో పోలి ఉందని చర్చలు మొదలయ్యాయి. కట్ చేస్తే.. బ్రో సినిమా యాక్టర్స్ తో పాటు దర్శకనిర్మాతలపై సైతం ఫైర్ అయ్యారు ఫ్యాన్స్. దీనిపై మంత్రి అంబటి రాంబాబు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘నాది ఆనంద తాండవం.. నీది శునకానందం’ అంటూ పవన్ కు గట్టిగా చురకలు అంటించారు. రాజకీయంగా తనను ఏమి చేయలేక.. ఇలా సినిమాలో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి, దూషించడం.. శునకానందం లాంటిదే అని మండిపడ్డారు. ఇలాంటి తరుణంలో బ్రో కలెక్షన్స్ పై అంబటి మరోసారి తన శైలిలో కామెంట్ చేశారు.

“ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు” అని ట్వీట్ పెట్టారు. అయితే.. బాక్సాఫీస్ వద్ద బ్రో మూవీ ప్రస్తుత పరిస్థితి అలాగే ఉండటం గమనార్హం. భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రో మూవీ.. మొదటిరోజు రూ. 30.05 కోట్లు నెట్ కలెక్షన్స్ తెచ్చింది. ఆ తర్వాత రెండో రోజు రూ. 17.05 కోట్లు.. 3వ రోజు రూ. 16.9 కోట్లు.. బాగానే కవర్ చేసింది. కానీ.. 4వ రోజు అంటే సోమవారం బ్రో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ బ్రో మూవీ నాలుగు రోజులలో రూ. 69.9 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మధ్య ఏ హీరో సినిమాలైనా వీకెండ్ లోనే రూ. 100 కోట్లు రాబడుతున్నాయి. మరి పవన్ సినిమా పరిస్థితి ఇలా అయ్యిందేంటి అని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదిగాక మేకర్స్ కూడా ఇప్పటిదాకా మూవీ కలెక్షన్స్ రివీల్ చేయకపోవడం మరో చర్చనీయంశం. మరి బ్రో మూవీ కలెక్షన్స్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet