iDreamPost

ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యులు ఆందోళనలు!

ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యులు ఆందోళనలు!

గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలి సమావేశాలకు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఏపీ అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో స్పీకర్ ఎంత వారించిన టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న క్రమంలో పోటీగా వైసీపీ సభ్యులు కూడా ఆందోళన చేశారు. టీడీపీ నేతల మాటలకు వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  చేసిన ఓవరాక్షన్ అసెంబ్లీలో ఉద్రిక్తత వాతావరణానికి కారణమైంది. ఆందోళన నేపథ్యంలో అసెంబ్లీని కాసేపటి వాయిదా వేశారు. అయితే ఇదే పరిస్థితి శాసన మండలిలోనూ కనిపించింది.

గురువారం ఉదయం ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలోను టీడీపీ సభ్యుల తీరు మారలేదు. మండలిలో  కూడా ప్రశ్నోత్తరాలను టీడీపీ సభ్యులు అట్టుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు వాయిదా తీర్మానానికి సంబంధించిన బిల్లును ఛైర్మన్ కు అందజేశారు. అయితే టీడీపీ నేతలు ఇచ్చిన ఈ తీర్మానాన్ని ఛైర్మన్ తిరష్కరించారు. ఛైర్మన్ ఎంత సర్థి చెప్పిన వినకుండా టీడీపీ  సభ్యులు నినాదాలు చేశారు. దీంతో శాసనమండలిలో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రశ్నోత్తరాలు పూర్తైన తరువాత, సరైన పద్ధతిలో వస్తే.. ఏ అంశంపైనైనా చర్చిండానికి సిద్ధమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టీడీపీ, పీడీఎఫ్ సభ్యుల ఆందోళనలతో శాసన మండలిని వాయిదా వేశారు. ఐదు నిమిషాల పాటు మండలిని వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఇలా ఉభయ సభల్లో టీడీపీ నేతలు ఆందోళనతో కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి.. ఏపీ శాసనమండలి, శాసన సభ సమావేశాలు జరుగుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి