iDreamPost

లోకేశ్ కు హైకోర్టు షాక్.. ఈ నెల 10న విచారణకు ఆదేశం

లోకేశ్ కు హైకోర్టు షాక్.. ఈ నెల 10న విచారణకు ఆదేశం

నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో లోకేశ్ ను ఎ14గా సీఐడీ చేర్చిన సంగతి తెలిసిందే. సీఐడీ దర్యాప్తులో.. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరిట జరిగిన భారీ అవినీతి వెలుగు చూసింది. దాంతో సీఐడీ ఏ-1గా చంద్రబాబు నాయుడును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణను ఈ కేసులో చేర్చింది. ఇప్పటికే చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా తేల్చిన సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెట్రల్ జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో రేపు జరపాల్సిన లోకేష్ విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 10న విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ ఇచ్చిన 41ఎ నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ లోకేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు లాయర్ సమక్షంలో నారా లోకేశ్ ను విచారించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఏపీ సీఐడీ నారా లోకేశ్ ను 14 చేర్చింది. అయితే దీనిపై లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ సీఐడీ నారా లోకేశ్ కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. 41ఏ సిఆర్‌పిసిలో సిఐడి అధికారులు హెరిటేజ్ బోర్డు మీటింగ్ మినిట్స్‌ను వెల్లడించాలని కోరారు. అయితే హెరిటేజ్ భూముల విక్రయాల లావాదేవీలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ, సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ లోకేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు లోకేశ్ ను ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి