iDreamPost

రైతులకు అండగా జగన్.. 48 గంటల్లోనే 1.07 లక్షల టన్నుల ధ్యానం కొనుగోలు!

మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు చిగురుటాకుల వణికిపోయాయి. అంతేకాక వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధితులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిల్చొంది.

మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు చిగురుటాకుల వణికిపోయాయి. అంతేకాక వేలాది ఎకరాల్లో పంట నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధితులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిల్చొంది.

రైతులకు అండగా జగన్.. 48 గంటల్లోనే 1.07 లక్షల టన్నుల ధ్యానం కొనుగోలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదవారిని ఆదుకోవడంలో ముందుంటారు. అంతేకాక ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించి ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.  అందుకు నిదర్శనంగా అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు సీఎం జగన్ వెంటనే స్పందిస్తుంటారు. అంతేకాక బాధితులను ఆదుకోవాలంటూ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేస్తుంటారు. తాజాగా మిచౌంగ్ తుఫాన్ బాధితులు, రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారు. దీనిని తట్టుకునేందుకు అత్యవసర ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు నిధులు విడుదల చేసింది.

తుఫాన్, వరదలు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు జగన్ సర్కార్ స్పందించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్య ధోరణి లేకుండా.. బాధితులకు భరోసా కల్పిస్తూ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. తుఫాన్  తీవ్రను తట్టుకునేలా చర్యలను తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాక తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతన్నలకు జగన్ అండగా నిలబడ్డారు. 48 గంటల వ్యవధిలోనే 1.07 లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పంట నష్టపోయామనే బాధలో ఉన్న వారికి జగన్ ప్రభుత్వం కాస్త ఊరట నిచ్చింది.

ఇక మిచౌంగ్ తుపాన్ కారణంగా ఏపీలోని పలు జిల్లాలు జలమయ్యం అయ్యాయి. కొన్ని జిల్లాలో నగరాలు, కాలనీలు, గ్రామాలు చెరువులను తలపించాయి. ఇక ఈ తుఫాన్ ధాటికి వేలాది ఎకరాల పంట నీటి పాలైంది. వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. అంతేకాక ఈ తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మనం ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, సహాయక శిబిరాల్లో అలాంటివి ఉండాలని, డబ్బు ఖర్చైనా ప్రజలకు ఎలాంటి లోటూ రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ప్రతీ బాధిత కుటుంబానికి రూ.2,500 ఇవ్వాలని, బాధిత వ్యక్తికి అయితే రూ.1000 ఇవ్వాలన్నారు. క్యాంపులకు రాకుండా నీళ్లలోనే ఇళ్ల వద్ద ఉన్నవారికి 25 కేజీల బియ్యం, కంది పప్పు, నూనె, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలన్నారు.

అదే విధంగా పంటను కాపాడుకునే దిశగా తేమ శాతంతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. తుఫాన్ వచ్చిన తరువత గత 48 గంటల్లో సుమారు 1.07లక్షల టన్నుల ధాన్యాన్ని ఏపీ ప్రభుత్వం రైతుల నుండి సేకరించింది. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఆన్‌లైన్‌లో 75 వేల మంది రైతుల నుంచి రూ.1,211 కోట్ల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించింది.

ఇందులో 55 వేల మంది రైతులకు సుమారు రూ.750 కోట్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది. ఆదివారం ఒక్కరోజే 40 వేల టన్నులకుపైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంతో పాటు తుఫాను ప్రభావిత జిల్లాలలో 181 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. మరి.. తుఫాన్ కారణంగా నష్ట తీవ్రతను తగ్గించేందుకు వైఎస్సాఆర్ సీపీ ప్రభుత్వం చేపట్టిన పనులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి