iDreamPost

ట్రైబల్ యూనివర్సిటీ గిరిపుత్రల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్

ట్రైబల్ యూనివర్సిటీ గిరిపుత్రల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్నారు. అనేక ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. అలానే ఆదివాసీలు, గిరిజనలు అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. గిరి పుత్రులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక భరోసాను సీఎం జగన్ కల్పించారు. తాజాగా మరో అడుగు ముందుకేసి  కేంద్రీయ గిరిజిన యూనివర్సిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం సాలూరులో ప్రతిష్టాత్మక  కేంద్రీయ గిరిజిన విశ్వ విద్యాలయానికి సీఎం జగన్ శంకుస్థాపన్ చేశారు. సాలూరు నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో రూ.834 కోట్లతో  ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గిరిజనులపై తన ప్రేమను వ్యక్త పరిచారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో గిరిజనులు ప్రపంచంతో పోటీ పడతారని సీఎం జగన్ గట్టిగా చెప్పారు. గిరిజనులు స్వచ్ఛమైన మనసు గలవారని, వారు తరతరాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..”  మన ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్ల పాలనలో  మీ బిడ్డ విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. దోపిడీకి గురి కాకుండాగిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. గిరిపుత్రుల కోసం ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలు తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ తో విద్యాదీవెన, వసతిదీవెన  తీసుకువచ్చాం. గిరిజన విద్య, సాధికారతకు మన ప్రభుత్వం బాటలు వేస్తోంది.

కురుపాంలో ట్రైబల్  ఇంజనీరింగ్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ రాబోతోంది. విద్యరంగంలోనే కాకుండా రాజకీయ పరంగా కూడా గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను ఉపముఖ్యమంత్రిని చేశాం. 4.58 లక్షల గిరిజన కుటుంబాలకు  నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.  గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. తాజాగా ఏర్పాటు కానున్న ట్రైబల్ యూనివర్సిటీ గిరిపుత్రుల జీవితాలను మారుస్తుంద” సీఎం జగన్ ఆకాంక్షించారు. మరి.. సీఎం జగన్ ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: TDP ఆర్భాటం.. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది: విజయ సాయిరెడ్డి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి