iDreamPost

పోలవరం ప్రాజెక్ట్ లో కీలక భాగం పునరావాస ప్యాకేజీ, నిర్వాసితుల పై దృష్టి పెట్టిన ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్ట్ లో కీలక భాగం పునరావాస ప్యాకేజీ, నిర్వాసితుల పై దృష్టి పెట్టిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ మీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులో కీలక భాగం నిర్మాణాలు సాగుతున్న సమయంలో పునరావాస ప్యాకేజీ కోసం ప్రాధాన్యతనిస్తోంది. అందులో భాగంగా నిర్వాసితులకు తగు న్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పునరావాస ప్యాకేజీ అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా నిర్వాసితుల సమస్యలపై నేరుగా కేంద్రీకరిస్తోంది. చాలాకాలంగా ప్రాజెక్ట్ చుట్టూ సాగుతున్న చర్చలో నిర్వాసితుల అంశానికి తగిన ప్రాధాన్యత దక్కలేదు. కానీ ప్రస్తుతం జగన్ పరభుత్వం నిర్వాసితులకు పునరవాస ప్యాకేజీ తొలి విడతలో భాగంగా రూ.79 కోట్లు కేటాయించారు.

గతంలో పునరావాస చర్యల విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చూపించారు. ఆందోళనలు చేపట్టినా ఖాతరు చేయకుండా ముందుకెళ్లారు. చివరకు మొన్నటి గోదావరి వరదల్లో వేల మంది వారాల తరబడి నీటిలో మునిగి నానా ఇక్కట్లు పాలు కావాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉభయ గోదావరి జిల్లాల నిర్వాసిత గ్రామాలకు చెందిన 69 వేల మంది ముంపు బారిన పడ్డారు. కాఫర్ డ్యామ్ నిర్మాణమే తప్ప నిర్వాసితుల గోడు పట్టించుకోనందుకు సామాన్యులు పరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు కి పర్సంటేజీలు మాకు వరద నీళ్లా అని అప్పట్లోనే పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు తనయుడిని కూడా స్థానికులు తిప్పిపంపారు. ముంపు గ్రామాల్లో పర్యటనకు వచ్చిన లోకేష్ కి వరద బాధితుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనుదిరగాల్సి వచ్చింది.

వైఎస్సార్ హయంలో కల్పించిన పునరావాసం తప్ప ఆ తర్వాత పోలవరం నిర్వాసితులకు సంబంధించిన తగు నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత నిర్వాసితులకు న్యాయం చేస్తామని పోలవరం ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. దానికి అనుగుణంగా ప్యాకేజీ కూడా విడుదల అయ్యింది.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇళ్లకు నష్టపరిహారం కోసం ఇటీవలనే రూ.79 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో కొంత ఉపశమనం ఖాయమని నిర్వాసితులు భావిస్తున్నారు. తక్షణమే ముంపునకు గురవుతున్న కాఫర్ సమీప గ్రామాల వాసులకు ఊరట కల్పించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పునరావాస కాలనీల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేశారు.

తాజాగా నిర్వాసితుల సమస్యలను నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ కలిసి పరిశీలించారు. పునరావాస సహాయ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాసం వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యల కోసం సమీక్ష చేశారు. ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఆ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి