iDreamPost

Allu Arjun: శిల్పా రవి కోసం ట్వీట్‌ చేస్తే సరిపోదని.. నేనే స్వయంగా వచ్చాను: అల్లు అర్జున్

  • Published May 11, 2024 | 2:56 PMUpdated May 11, 2024 | 2:56 PM

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతివ్వడం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ శనివారం ఇక్కడకు వచ్చారు. శిల్పా రవికి మద్దతిచ్చారు. ఆ వివరాలు..

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతివ్వడం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ శనివారం ఇక్కడకు వచ్చారు. శిల్పా రవికి మద్దతిచ్చారు. ఆ వివరాలు..

  • Published May 11, 2024 | 2:56 PMUpdated May 11, 2024 | 2:56 PM
Allu Arjun: శిల్పా రవి కోసం ట్వీట్‌ చేస్తే సరిపోదని.. నేనే స్వయంగా వచ్చాను: అల్లు అర్జున్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌… నేడు నంద్యాలలో పర్యటించారు. ఆయన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డికి మద్దతు తెలపడం కోసం బన్నీ తన భార్య అల్లు స్నేహారెడ్డితో కలిసి నంద్యాలకు వచ్చారు. బన్నీని చూసేందుకు భారీ ఎత్తున జనాలు తరలి వచ్చారు. దాంతో నంద్యాల కాస్త జనసంద్రంగా మారింది. ఎన్నికల ప్రచారం చివరి రోజున బన్నీ నంద్యాల పర్యటనకు భారీ ఎత్తున జనాలు తరలి రావడం వైసీపీ వర్గాల్లో జోరు పెంచింది. తన స్నేహితుడు శిల్పా రవికి ఓటు వేయమని కోరారు బన్నీ. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శిల్పా రవి గత ఆరేళ్లుగా ఎంతో కష్టపడుతున్నారని.. ఆయన కష్టానికి ట్వీట్‌ చేస్తే సరిపోదని.. తానే స్వయంగా వచ్చాను అని తెలిపారు బన్నీ. ఆ వివరాలు..

ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ..‘‘శిల్పా రవి నాకు చాలా మంచి స్నేహితుడు. రాజకీయాలకు అతీతంగా మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఆయన నాకు పరిచయం. ఆయన రాజకీయాల్లోకి రాకముందు.. మేమిద్దరం వారినికో, పది రోజులకు ఒకసారో కలిసేవాళ్లం. కానీ గత ఐదేళ్లుగా మేం ఆరు నెలలకు ఒకసారి మాత్రమే కలుస్తున్నాం. అక్కడే అర్థం అవుతుంది. ఆయన ఎంత కష్టపడుతున్నారో. అందుకే కేవలం ట్వీట్‌ చేస్తే సరిపోదని.. నేను స్వయంగా ఇంటికి వచ్చి ఆయనకు సపోర్ట్‌ చేయాలనుకున్నాను. అందుకే ఇక్కడకు వచ్చాను’’ అని తెలిపాడు బన్నీ.

‘‘శిల్పా రవి మొదటిసారి పోటీ చేస్తున్నప్పుడు.. నేను కేవలం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశాను. కానీ ఈసారి అది నాకు సరిపోదనిపించింది. ఆయన నాకు ఎంతో మంచి స్నేహితుడు. పైగా ఈ ఆరేళ్ల నుంచి ఆయన ఎంత కష్టపడుతున్నారో నేను చూశాను. అంత కష్టపడే మనిషి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందుకే ఆయనకు వ్యక్తిగతంగా బెస్ట్‌ విషెస్‌ తెలపడం కోసం నేను, నా భార్య ఇక్కడకు వచ్చాము. ఈ ఎన్నికల్లో ఆయన మంచి విజయం సాధించాలి. జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. అది చూసి నేను గర్వపడాలి అని కోరుకుంటున్నాను’’ అన్నాడు బన్నీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి