iDreamPost

AP సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు.. ఎందుకంటే?

Nara Chandrababu Naidu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఇసుక పాలసీ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. చంద్రబాబు సీఐడీ ముందు హాజరయ్యారు.

Nara Chandrababu Naidu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఇసుక పాలసీ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. చంద్రబాబు సీఐడీ ముందు హాజరయ్యారు.

AP సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు.. ఎందుకంటే?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సీఐడీ ఆఫీస్ కి వస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు కాస్త ఓవరాక్షన్ చేసినట్లు సమాచారం. చంద్రబాబుపై వివిధ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే కోర్టు కొన్ని షరుతులతో, పూచికత్తులతో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆయన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల తరువాత మధ్యతర బెయిల్ ద్వారా విడుదలయ్యారు. అనంతరం ప్రధాన బెయిల్ రావడంతో ఇక పూర్తిగా బయటనే ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఇసుక కుంభకోణం కేసులో కూడా చంద్రబాబుకు హైకోర్టు ముందుస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశాల మేరకు విజయవాడలోని నేర పరిశోధన సంస్థ(సీఐడీ) ఆఫీస్ కి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో ష్యూరిటీ సమర్పించేందుకు ఆయన సీఐడీ ఆఫీస్ రావడంతో అక్కడికి వచ్చిన టీడీపీ శ్రేణులకు ఆయన అభివాదం చేశారు. అయితే ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు కాస్తా అత్యుత్సాహం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.  ఇసుక పాలసీ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం పాలసీ కేసులో కూడా చంద్రబాబుకు  హైకోర్టు ముందుస్తు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు రాక నేపథ్యంలో టీడీపీ పెనుమలూరు అసెంబ్లీ సీటను  ఆశిస్తున్న బోడే ప్రసాద్ ఓవరాక్షన్ చేశారని తెలుస్తోంది. తన వర్గంతో  సీఐడీ కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించారు. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో ఇసుక కుంభకోణం జరిగింది. 2014లో రాష్ట్ర విభజనకు ముందు రీచ్ ల వారీగా వేలం పాటలు నిర్వహించారు. అయితే చంద్రబాబు వచ్చాక పలు మార్పులు జరిపారు.

తొలుత డ్వాక్రా మహిళా సంఘాలకు రీచ్ లు అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఆ సమయంలో మహిళా సంఘాల ముసుగులో ఇసుకపై టీడీపీకి చెందిన నేతలు పూర్తి పెత్తనం చలాయించారు. అప్పట్లో కేబినెట్ ఆమోదం లేకుండానే ఇసుకపై చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు ఇంటికి కిలో మీటర్ దురంలో  ఉన్న కృష్ణా నదిలో కూడా భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఏపీలో 2014-19 మధ్య జరిగిన అక్రమాలపై  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సీరియస్ అయ్యింది. చంద్రబాబు ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమాన కూడా విధించింది. ఏపీఎండీసీ ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన సీఐడీ. ఈ ఇసుక అక్రమాల కేసులో ఏ2గా చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలోనే జరిగిన పరిణామాల నేపథ్యంలోనే తాజాగా సీఐడీ ఆఫీస్ కి చంద్రబాబు వచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి