iDreamPost
android-app
ios-app

వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ.. డాక్టర్లు లేకుండానే 24/7 క్లినిక్

వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ.. డాక్టర్లు లేకుండానే 24/7 క్లినిక్

డాక్టర్లు లేకుండానే 24/7 క్లినిక్. వైద్యులు లేకుండా 24 గంటల పాటు క్లినిక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు చదివింది నిజమే. 24/7 డాక్టర్లు లేకుండానే సరికొత్త క్లినిక్ త్వరలో హైదరాబాద్ వాసులకు అందులోబాటులోకి రానుంది. అత్యాధునిక టెక్నాలజీతో డెవలెప్ చేసిన ఈ క్లినిక్ మరి కొన్ని రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. అసలు వైద్యులు లేకుండా క్లినిక్ ఏంటి? అసలు విషయం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ కు చెందిన జిమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీ సంస్థ వైద్య చరిత్రలో కొత్త టెక్నాలజీని మనం ముందు ఉంచనున్నారు. ఎనీ టైమ్ క్లినిక్ పేరుతో కియోస్కీని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రూ.150 నుంచి 200 ఖర్చుతో 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు పొందవచ్చట. దీనిపై జిమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీ సంస్థ ఎండీ వినోద్ కుమార్ స్పందించి ఈ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

వైద్యులు అవసరం లేకుండా, సూది గుచ్చకుండా కియోస్కీ ద్వారా 24/7 వైద్య పరీక్షలు నిర్వహించుకోవచ్చని అన్నారు. ఇక ఎఫ్ డీఏ ఇతర అనుమతులు పొందిన తర్వాతే దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని ఎండీ తెలిపారు. ముందుగా దీనిని హైదరాబాద్ లోని శిల్పారామం ఏరియాలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. అయితే గతంలో ఈ సంస్థ గోల్డ్ ఏటీఎం, టీ, కాఫీలను అందించే వెండింగ్ యంత్రాలను సైతం రూపొందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా 24 గంటల పాటు డయోగ్నోస్టిక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.

ఇది కూడా చదవండి: వీడియో: చూస్తుండగానే పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్