iDreamPost

ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో అనుపమ పరమేశ్వరన్

  • Published Mar 20, 2024 | 12:39 PMUpdated Mar 20, 2024 | 12:39 PM

ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాని కూడా ఈ దర్శకుడు ప్రకటించారు. హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో సహజంగానే జై హనుమాన్ సినిమా గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాని కూడా ఈ దర్శకుడు ప్రకటించారు. హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో సహజంగానే జై హనుమాన్ సినిమా గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

  • Published Mar 20, 2024 | 12:39 PMUpdated Mar 20, 2024 | 12:39 PM
ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో అనుపమ పరమేశ్వరన్

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ తో అందరూ చూపుని తన వైపుకు తిప్పుకున్నారు. ఆ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాని కూడా ఈ దర్శకుడు ప్రకటించారు. హనుమాన్ భారీ బ్లాక్ బస్టర్ అవడంతో సహజంగానే జై హనుమాన్ సినిమా గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజీ సీక్వెల్ కోసం ప్రశాంత్ ఎవరిని స్క్రీన్ పైకి తీసుకువస్తారనే దాని పై చాలా చర్చలు సాగినప్పటికీ, ప్రస్తుతానికి కొంత కాలం వరకూ జై హనుమాన్ సినిమా పనులు ఆపేసినట్లు కనిపిస్తోంది. ఇదివరకే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ఆక్టోపస్ సినిమా సగం తీసి మళ్ళీ ఆ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ ఇంకా ఏ నటీనటులను కూడా ఎంపిక చేయలేదని అంటున్నారు. అందుకే ఈ గ్యాప్ లో ‘ఆక్టోపస్’ పూర్తి చేయాలనేది ప్రశాంత్ ప్లాన్ లా కనిపిస్తుంది. ఆక్టోపస్ చాలా కాలంగా ప్రశాంత్ వర్మ చేస్తున్న ప్రాజెక్ట్. అతను గతంలో 65 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తన మొదటి సినిమా “అ” తోనే తన స్టయిల్ వేరే అని ప్రశాంత్ వర్మ చెప్పేశారు. ఆ తర్వాత జోంబీ రెడ్డి, కల్కి సినిమాలు కూడా కాస్త కొత్తదనం ఉన్న సినిమాలే. ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ తో ప్రశాంత్ వర్మ స్టార్ డైరక్టర్ అయ్యారని చెప్తే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.

క్యూట్ లుక్స్ తో ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ త్వరలో విడుదల కానున్న టిల్లు స్క్వేర్ సినిమాలో తన గ్లామర్ షోతో అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో తను ఎలాంటి పాత్ర చేస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికయితే ఆక్టోపస్ సినిమా కథ గురించి ఎలాంటి సమాచారం లేదు కానీ ఈ సినిమా అక్టోబర్ లో విడుదలవుతుందని అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి