iDreamPost

హనుమాన్ సీక్వెల్ పై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ అప్డేట్

  • Published Mar 31, 2024 | 3:29 PMUpdated Mar 31, 2024 | 3:29 PM

ఆ పైన సినిమాలో చివరి సీన్ లో రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట అంటూ సీక్వెల్ కి హింట్ ఇచ్చారు. దాంతో ప్రేక్షకులు జై హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఉదయం దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో అంజనాద్రి 2.0 అంటూ ఒక విడియో షేర్ చేశారు.

ఈ సంక్రాంతికి వచ్చి అనూహ్యంగా భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా హనుమాన్. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక సినిమా విడుదలకి ముందే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగం అని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఆ పైన సినిమాలో చివరి సీన్ లో రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట అంటూ సీక్వెల్ కి హింట్ ఇచ్చారు. దాంతో ప్రేక్షకులు జై హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఉదయం దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో అంజనాద్రి 2.0 అంటూ ఒక విడియో షేర్ చేశారు.

అంజనాద్రి అంటే హనుమాన్ సినిమాలోని పల్లెటూరు. సినిమా కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసిన ఈ బ్యాక్ డ్రాప్ అద్భుతంగా ఉండి హనుమాన్ కి ఒక కొత్త లుక్ తీసుకు వచ్చింది. కొండ ప్రాంతం, నదీ తీరం, హనుమంతుడి విగ్రహం వంటి హంగులతో కూడిన అంజనాద్రి ప్రపంచం అందరినీ ఆకట్టుకుంది. మరి ప్రశాంత్ వర్మ లేటెస్ట్ ట్వీట్ చూస్తుంటే అంజనాద్రికి మరిన్ని హంగులు అద్దినట్టు కనిపిస్తుంది. అయితే ప్రశాంత్ ట్వీట్ లో జై హనుమాన్ షూటింగ్ గురించి ఎటువంటి వివరాలూ ఇవ్వలేదు. ఇప్పటికే ఈ సినిమాలో నటీనటుల గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్ లేదా రానా నటిస్తారని, రాముడి పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని పుకార్లు వచ్చినా… అవేవీ అధికారికంగా ప్రకటించలేదు. మరి జై హనుమాన్ కాస్టింగ్ గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదేమో.

హనుమాన్‌ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల వరకూ వసూలు చేసింది. కల్పిత గ్రామమైన అంజనాద్రి నేపథ్యంలో సాగే హనుమాన్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)కి నాంది పలికారు. ఇటివల రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా వేడుక శుభ సందర్భంగా, ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాని అధికారికంగా ప్రకటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి