iDreamPost

గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఇక మరింత ఫాస్ట్‌గా!

తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో రాకపోకాలు సాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే రద్దీ కూడా నెలకొంది. అయితే ఇప్పుడో గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో రాకపోకాలు సాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. అలాగే రద్దీ కూడా నెలకొంది. అయితే ఇప్పుడో గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ. తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది.

గుడ్ న్యూస్..  తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఇక మరింత ఫాస్ట్‌గా!

తెలుగు రాష్ట్రాల్లో రైళ్లల్లో ప్రయాణీస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. కొన్ని రూట్లలో అయితే చాలా రద్దీ కూడా నెలకొంటోంది. దీంతో రైళ్ల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌తో పాటు కొత్త రైల్వే మార్గాలు వేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుండో పరిశీలనలో ఉంది. వాటిల్లో ఒకటి బీబీ నగర్- గుంటూరు రైల్వే లైన్. ఈ మార్గంలో ప్రస్తుతం సింగిల్ లైన్ మాత్రమే ఉండగా.. డబ్లింగ్ ప్రాజెక్టుకు గత ఏడాది మంజూరైంది. దీంతో త్వరలోనే ఇక్కడ రెండో రైల్వే లైన్ పనులు ప్రారంభం కానునన్నాయి.   ఇక్కడ కొత్త రైల్వే లైన్ పనులు పూర్తయితే.. రాకపోకల్లో సమస్యలు తగ్గుతాయి. మరింత వేగంతో రైళ్లు ప్రయాణించే ఛాన్స్ కూడా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు టైమ్ సేవింగ్ అవుతుంది.

క్రాసింగ్ సమస్య తగ్గి.. సకాలంలో గమ్య స్థానాలకు చేరుకోవచ్చు ప్రయాణీకులు. అలాగే మరిన్ని రైళ్లను నడిపే అవకాశం కూడా ఉంటుంది.  అలాగే ఎక్కువ స్టేషన్లలో రైళ్లను ఆపేందుకు ఆస్కారం ఉంటుంది. బీబీ నగర్-గుంటూరు రైల్వే మార్గం గుండా అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్, విజయవాడ, గుంటూరు ఇంటర్ సిటీ ట్రైన్స్, సికింద్రాబాద్-విశాఖ దురంతో ఎక్స్ ప్రెస్, శబరి, ఫలక్ నామా, నారాయణాద్రి, నర్సాపూర్, గోల్కొండ, పల్నాడు, జన్మభూమి, విశాఖ ఎక్స్ ప్రెస్ వంటి రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. రెండు, మూడు నెలల్లో వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

బీబీ నగర్- గుంటూరు రెండో ట్రైన్ లైన్ నిర్మాణానికి రూ. 2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే శాఖ గతంలోనే అంచనా వేసింది. 293 కిలో మీటర్ల లైన్ నిర్మాణం తర్వాత రేట్ ఆప్ రిటర్న్ 11.20 శాతం వస్తుందని రైల్వే శాఖ రీసెర్చ్‌లో తేలింది. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఓట్ ఆన్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కాగా, జూన్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే.. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. అందులో ఈ రైల్వే మార్గానికి అధిక నిధులు కేటాయిస్తే.. పనులు మరింత వేంగంగా మొదలు కావడంతో పాటు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ రైలు మార్గం కనుక పూర్తయితే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి