iDreamPost

చుక్కలు చూపిస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు..

చుక్కలు చూపిస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు..

ప్రస్తుతం నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలానే గ్యాస్ ధరలతో పాటు ఇంధన ధరలు కూడా రెక్కలు వచ్చినట్లు ఎగురుతున్నాయి.  పెరిగిన ధరల దెబ్బకు సామాన్యులు అల్లాడి పోతున్నారు. మన పరిస్థితే ఇట్లా ఉంటే ఇక పాకిస్థాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుపోయిన పాకిస్థాన్ లో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తోన్నాయి. తాజాగా పాకిస్థాన్ లో పెట్రోల్ ధర కొత్త రికార్డు నెలకొల్పింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి వెల్లడించింది. దీంతో ముడి చమురు ధర  లీటర్ రూ.330కి చేరుకుంది.

గత కొద్ది రోజుల నుంచి పాకిస్థాన్ లో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలోనే నెల రోజుల వ్వవధిలోనే ఈ ప్రభుత్వం .. పెట్రోలుపై లీటరుకు రూ.32.41, డీజిల్ పై రూ.38.49 పెంచింది. ఇలా వరుసగా ఇంధన ధరలు, నిత్యవసర ధరలు పెంచుతూ.. ఆ దేశ ప్రజల నడ్డిని అక్కడి ప్రభుత్వం విరుస్తోంది. ఈ ధరలు తట్టుకోలేక లబోదిబో మంటున్నారు. ఇదే సమయంలో ధరల పెరుగుదలపై భగ్గుమన్న ప్రతిపక్షాలు.. ఆందోళనలకు సిద్ధమయ్యాయి. పెరుగుతున్న ధరలపై సవాల్‌ చేస్తూ లాహోర్‌ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. పాక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం కారణఁగా  ఇంధన ధరలు, విద్యుత్ ధరలు వాయు వేగంతో పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు, వ్యాపారాల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

శుక్రవారం రాత్రి ఇంధన ధరలపై ఆర్థిక శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో పాకిస్థాన్ లో చమురు ధరలు లీటరుకు రూ.330కి చేరుకున్నాయి. ఈ స్థాయికి ధరలు పెరగడం ఆ పాక్ చరిత్రలో ఇదే మొదటిసారి. గత నెలలోనే పెట్రోల్, డీజిల్ ధర లీటరు రూ.300కు చేరింది. వచ్చే నవంబర్‌లో ఆ దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందే పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి.. పాకిస్థాన్ లో ఉన్న ఈ ఆర్థిక సంక్షోభంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి