iDreamPost

కర్బూజ లాంటి ఈ పండు ధర రూ.20 లక్షలు! దీని ప్రత్యేకత ఏంటంటే?

కర్బూజ లాంటి ఈ పండు ధర రూ.20 లక్షలు! దీని ప్రత్యేకత ఏంటంటే?

మాములుగా బయట మార్కెట్ లో దొరికే కర్బూజ సీజన్ ను బట్టి రేట్లు మారడం అనేది సర్వసాధారణం. కానీ, కర్బూజ లాంటి ఈ పండు ధర కిలో రూ.20 లక్షల పలకడం మీరు ఎప్పుడైనా విన్నారా? కిలో రూ.20 లక్షలు ఏంటని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. ఓ దేశంలో మాత్రం ఈ కర్బూజ లాంటి ఈ పండు కిలో రూ.20 లక్షలకు అమ్ముడుపోయిందట. అసలు ఇంతకు పండు ప్రత్యేకత ఏంటి? దీన్ని ఎక్కడ పండిస్తారు? అసలు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పండ్లలో ఈ వాటర్ మిలన్  ఒకటి. దీన్ని జపాన్ హక్వైడ్ ద్వీపంలోని యుబారి నగరంలో మాత్రమే పండించే పంట. అందుకే కర్బూజ లాంటి ఈ పండును యుబారి కింగ్ అని పేరొచ్చింది. దీన్ని ఎక్కువగా పగలు, రాత్రి ఉష్ణోగ్రత్తల మధ్య పండిస్తారు. దీని వల్లే ఈ పండు రుచిలో కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ పండు యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్ గా ఉండడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహయపడుతుంది. అయితే ఇందులో విటమిన్ సీ, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియంతో పాటు పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ పండును 2022లో నిర్వహించిన వేలంలో ఏకంగా కిలో ధర రూ.20 లక్షలు పలకడం విశేషం. ఇక, అంతకు ముందు ఏడాదిలో మాత్రం కిలో రూ.18 లక్షలు పలికిందట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి