iDreamPost

అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవ అంటే అన్నం పెట్టినవాడో, అన్నం వడ్డించిన వాడో కాదు. ఆ పంట పండించిన వాడు అని అర్ధం.

నేటి సమాజంలో ప్రతి ఒక్కరు మొబైల్ లేకుండా, టివి లేకుండా, ఇల్లు లేకుండా, కార్ లేకుండా, బైక్ లేకుండా ఇలా ఏమి లేకుండా ఉండగలడు. కానీ అన్నం లేకుండా ఎవరు బ్రతకలేరు.

ధనికుడైన, పేదవాడైనా ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించి ఎన్ని వస్తువులు కొన్నా ఎంత డబ్బు వున్నా ఏమి తినకుండా వుండలేడు. సమాజంలో ప్రతి దానికి ఒక రేటు వుంది కానీ రైతు పండించే దానికి ఒక రేటు లేక నష్టం వచ్చినా సరే మళ్ళీ పెట్టుబడులు పెడుతూ పంట పండిస్తున్నాడు. ఇలా ప్రతి రైతు పండించే ఒక్కో గింజ పండటానికి వంద రోజులు పడుతుంది. ఒక్కొక్కటి నెల రోజులకు, మూడు నెలలు, ఒక్కొకటి ఆరు నెలలు ఇలా కాలాన్ని బట్టి అవి పండుతాయి.

దేశంలో ప్రజలందరికి రైతు పండించి అందచేస్తున్నాడు. కానీ మూడు పూట్ల తినటానికి కూడా లేని దేశంలో చాలా మంది వున్నారు. సకాలంలో వర్షాలు పడక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినను రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు.

రైతులు పడే కష్టాలు తెలుసుకొని అన్నం వృధా చేయకుండా ఉండాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి