iDreamPost

వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చే మార్గం లేక యువరైతు సూసైడ్

దేశానికి వెన్నెముక రైతు, రైతే రాజు.. ఇలా ఎంతో మంది కర్షకుడి గురించి మాటలు చెప్పే వారే. కానీ.. అప్పుల బాధతో రైతులు చేసుకునే ఆత్మహత్యలను మాత్రం ఆపలేక పోతున్నారు. తాజాగా ఓ యువత రైతు..మట్టిని నమ్ముకుని.. చివరకు ఆ మట్టిలోనే కలిసిపోయాడు.

దేశానికి వెన్నెముక రైతు, రైతే రాజు.. ఇలా ఎంతో మంది కర్షకుడి గురించి మాటలు చెప్పే వారే. కానీ.. అప్పుల బాధతో రైతులు చేసుకునే ఆత్మహత్యలను మాత్రం ఆపలేక పోతున్నారు. తాజాగా ఓ యువత రైతు..మట్టిని నమ్ముకుని.. చివరకు ఆ మట్టిలోనే కలిసిపోయాడు.

వ్యవసాయం కోసం అప్పులు.. తీర్చే మార్గం లేక యువరైతు సూసైడ్

భూమిని సాగుచేసి..పంటలు పండించి అందరికీ అన్నం అందిస్తాడు రైతన్న. తాను కష్టపడి పని చేసి.. నలుగురికి కడుపు నింపుతాడు ఆ కర్షకుడు.  ఇంకా చెప్పాలంటే రైతులు పంటలు పండించడం మానేస్తే… దేశమంతా అన్నమో రామచంద్ర అంటూ అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి రైతన్నలు అప్పులు ఊబిలో చిక్కుకుపోతున్నారు. వాటిని తీర్చే మార్గం తెలియక ఆ ఊబిలోనే చిక్కుకుని మరణిస్తున్నారు. ఇలా ఎంతో మంది రైతులు ఉరి వేసుకుని ఊపిరి వదిలారు. తాజాగా ఓ యువత రైతు మరణం అందరిని కలచి వేసింది. వ్యవసాయం కోసం అప్పులు చేసి.. అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

హనుమకొండ జిల్లా ఐనోవోలు గ్రామానికి చెందిన బరిగెల ప్రశాంత్ (28) అనే యువ రైతు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయ పనలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రశాంత్ కి సొంత భూమి లేకపోవటంతో గ్రామంలోనే ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఇక కౌలుకు తీసుకున్న ఏడెకరాల భూమిలో 4 ఎకరాల్లో పత్తి పంటను వేశాడు. అలానే మిగిలిన 3 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నాడు. అయితే కాలంలో కలిసి రాక..గత రెండు, మూడేళ్ల నుంచి భారీగా నష్టాలు ఎదుర్కొన్నాడు.

భారీగా పెట్టుబడులు పెటడం.. అదే సమయంలో దిగుబడి తక్కువ రావడంతో నష్టాలు ఎక్కువయ్యాయ.  అలానే చీడ పీడలు, అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది. పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి కోసం రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటల్లో నష్టం రావడం, చేసిన అప్పులు పెరిగిపోతుండటంతో ప్రశాంత్ మానసికంగా కుంగిపోయాడు. ఆ అప్పులు తీర్చే మార్గం యువరైతుకు కనిపించలేదు. చాలా రోజుల పాటు తనలో తానే మానసిక వేదనకు గురయ్యాడు.  చివరకు అప్పులు తీర్చే మార్గం కనిపించక చావే పరిష్కారంగా భావించాడు. ఈనెల 20వ తేదీన సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ప్రశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే అతడిని గమనించిన కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని బ్రతికించే ప్రయత్నం చేశారు. వారు ప్రశాంత్ ను బతికించేందుకే సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. అప్పటికే ప్రశాంత్ మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా అప్పుల బాధతో ఎంతో మంది రైతన్నలు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరి..రైతుల ఆత్మహత్యలు నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి