iDreamPost

ఇతను 12th ఫెయిల్.. కానీ.., ఒక్క ఐడియాతో కోట్లు రూపాయలు సంపాదన!

  • Published Feb 19, 2024 | 2:44 PMUpdated Feb 19, 2024 | 2:47 PM

సాధరణ రైతు కుటుంబంకు చెందిన ఓ వ్యక్తి ఆర్థికంగా, చదువుల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఒక్క ఐడియా తన జీవితాన్నే మార్చేసింది. దీంతో కోట్లు రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకి ఎలా అంటే..

సాధరణ రైతు కుటుంబంకు చెందిన ఓ వ్యక్తి ఆర్థికంగా, చదువుల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఒక్క ఐడియా తన జీవితాన్నే మార్చేసింది. దీంతో కోట్లు రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకి ఎలా అంటే..

  • Published Feb 19, 2024 | 2:44 PMUpdated Feb 19, 2024 | 2:47 PM
ఇతను 12th ఫెయిల్.. కానీ.., ఒక్క ఐడియాతో కోట్లు రూపాయలు సంపాదన!

‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’. అనే ఈ మాట పెద్దలు చెప్పారు. అయితే ఈ వాక్యం అక్షరాల సత్యమంటూ ప్రస్తుత కాలంలో చాలామంది రుజువు చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే.. ప్రతిఒక్కరి జీవితంలో గెలుపు, ఓటములు సహజం. ఈ క్రమంలోనే.. చాలామంది ఆర్థికంగా ఫెయిల్ అవ్వవచ్చు, చదువులలో ఫెయిల్ అవ్వవచ్చు. కానీ, జీవితంలో మాత్రం సక్సెస్ గా నిలుస్తారు. అందుకు కారణం ఆత్మవిశ్వాసం. దీనిని నమ్ముకున్న ఎంతోమంది తమ సొంత కాళ్లపై నిలబడి 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి, అలాంటి కోవకు చెందినవాడే ఈ ‘సంతోష్ ఆగ్రే’. ఈయన చదువుల్లో ఫెయిలైయ్యాడు. కానీ జీవితంలో మాత్రం మంచి సక్సెను సాధించాడు. ఇతను ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు ఆ వివారాళ్లోకి వెళ్తే..

‘వాట్ ఎన్ ఐడియా సర్జీ’ అన్నట్లుగా.. ఒక ఐడియా ఓ రైతు జీవితాన్నే మార్చేసింది. తాజాగా మహారాష్ట్రకు చెందిన  ‘సంతోష్ ఆగ్రే’  అనే రైతు ఎన్నో కష్టాలను అధిగమించి నేడు ఒక వ్యాపారవేత్తగా ఎదిగాడు. అలాగే తాను స్వయంగా రూ. 2 లక్షల చెక్కు పై సంతకం చేస్తానని కలలో కూడా అనుకోలేదని భావోద్వేగంకు గురయ్యాడు. అసలు బ్యాంకు ఆకౌంట్ లేని ఆ వ్యక్తి నేడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంతకి ఆయన ఏం చేస్తున్నడంటే.. మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ ఆగ్రే 12వ తరగతి ఫెయిలైయ్యాడు. దీంతో ఔరంగాబాద్ లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో 7 ఏళ్లు పనిచేశాడు. కానీ, ఆ పనిలో సంతోష్ కు తృప్తిని ఇవ్వలేదు. అందుకే తన స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఉద్యోగం మానోద్దంటూ చెప్పారు. పైగా ఉద్యోగం మానేస్తే ఊరిలో మనకు ఉన్నది రెండు ఎకరాలే, వాటితో ఇక్కడికి వచ్చి ఏం చేయగలం అంటూ ప్రశ్నించారు. అయిన వాళ్ల మాట వినకుండా తాను ఊరికి తిరిగి వచ్చేశాడు. ఇక గ్రామానికి తిరిగి వచ్చిన సంతోష్ 6 ఏళ్లు మేకలను పెంచాడు. ఆ తర్వాత.. ‘ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్’ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.

అప్పుడే తన ఊరిలో ఉండే సోదరులు గుర్తుకు వచ్చారు. వారంతా గ్రామంలో పనులేవి లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. అలాగే వారిలో కొందరు 10, 12 చదువుకున్న వాళ్లే కాకుండా.. డిగ్రీ చదువుకున్న వాళ్లు కూడా ఉన్నారు. దీంతో తాను కంపెనీ పెట్టబోతున్నట్లు వాళ్లతో చెప్పాగా.. వాళ్లు ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే కంపెనీ పెట్టాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. కానీ.. మన దగ్గర అవి లేవని అన్నారు. అయితే సంతోష్ మాత్రం గ్రామంలో 10 మందిని ఒప్పించి ఒక్కొక్కరి దగ్గర రూ.10 వేలు సేకరించి లక్ష రూపాయాలు పెట్టుబడితో కంపెనీ స్థాపించాడు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. తక్కువ భూమి కలిగిన రైతుల దగ్గర పంట కొనేవారు. అయితే మొదటగా రూ.10 వేలు సేకరించిన సభ్యలు దగ్గరే మొక్కజొన్న పంటను కొనేవారు. ఆ తర్వాత ఊరిలో మిగతా రైతుల దగ్గర నుంచి కూడా మొక్కజొన్న పంట కొనేవారు. అలా వచ్చిన లాభాల్లో సభ్యులు ఇచ్చిన 10 వేలు ఒక నెలలో తిరిగి ఇచ్చేశారు.

అయితే, గతేడాది ఈ కొత్త కంపెనీ డబ్బులు ఇస్తుందా లేదా అని రైతులు మొదట అందోళన పడ్డారు. కానీ, సంతోష్ మిగత వ్యాపారస్తులతో పోలిస్తే.. పంటకు ఉన్న క్వింటాలు ధర కంటే ఎక్కువ డబ్బులు చెక్కు రూపంలో ఇచ్చేవాడు. దీంతో ఈ ఏడాది చుట్టుపక్కల 4 గ్రామాల రైతులు కూడా తమ పంటను సంతోష్ కంపెనీకి విక్రయించడానికి ఆసక్తి చూపేవారు. కాగా, సంతోష్ స్థాపించిన ‘బాబుల్ గావ్ కర్ మిత్ర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ ఇప్పటి వరకూ 11 లక్షలు పెట్టుబడి పెట్టారు. అయితే 2021 ఆక్టొబర్ లో ప్రారంభమైన ఈ కంపెనీ ఏడాదిలో ‘కోటి రూపాయలు టర్నవర్’  దాటేసింది. ప్రస్తుతం సంతోష్ కంపెనీ.. మొక్కజొన్నతో పాటు గోధుమలు, సోయాబీన్, కంది, శనగలు వంటివి వెయ్యి టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సంతోషం, ఆయన కంపెనీ పట్ల గ్రామస్తుల వైఖరిలో కూడా మార్పు వచ్చింది. కాగా, సంతోష్ గతేడాది కోళ్ల, పెంపకాన్ని మొదలు పెట్టడంతో పాటు పంట మిషన్ ను కూడా కొనుగోలు చేశారు. మరి, కేవలం ఒక రైతుగా ఉన్న వ్యక్తి వ్యాపారం కూడా చేసి ఎదగవచ్చని నిరూపించే సంతోష్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి