iDreamPost

రైతు బిడ్డ అద్భుతం.. ఏడాదికి రూ.1.5కోట్ల ఆదాయం!

వ్యవసాయం అంటే చాలా కష్టమని ఎక్కువ మంది అభిప్రాయా పడుతుంటారు. అంతేకాక పెట్టుబడులు ఎక్కువగా పెట్టి రైతులు అప్పుల పాలైన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కొందరు రైతులు మాత్రం వినూత్నంగా సేద్యం చేసి.. భారీ ఆదాయం పొందుతున్నారు.

వ్యవసాయం అంటే చాలా కష్టమని ఎక్కువ మంది అభిప్రాయా పడుతుంటారు. అంతేకాక పెట్టుబడులు ఎక్కువగా పెట్టి రైతులు అప్పుల పాలైన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కొందరు రైతులు మాత్రం వినూత్నంగా సేద్యం చేసి.. భారీ ఆదాయం పొందుతున్నారు.

రైతు బిడ్డ అద్భుతం.. ఏడాదికి రూ.1.5కోట్ల ఆదాయం!

దేశానికి రైతే వెన్నెముక అని చాలా మంది అంటుంటారు. కానీ రైతు ఆపదలో ఉంటే ఆదుకునే వారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు తీసుకొచ్చినా.. ఇంకా చాలా మంది రైతులు అప్పుల బాధతో  అల్లాడుతున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం మారుతున్న కాలానికి తగ్గట్టు వ్యవసాయం చేసే పద్ధతిలో మార్పులు చేసి.. భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాక జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తున్నారు. తాజాగా ఓ రైతు బిడ్డ ఏడాదికి కోటిన్నర రూపాయలను సంపాదిస్తున్నారు. ఆయనకు జాతీయ స్థాయిలో అవార్డు సైతం దక్కింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్ణాటక రాష్ట్రం కుందాపుర సమీపంలోని తెక్కట్టెకు చెందిన రమేశ్‌ నాయక్‌ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు 13 ఎకరాల సాగుభూమి ఉంది. గతంలో ఒక మిల్లును నడిపిస్తూనే మరోవైపు పాత పద్ధతిలో వ్యవసాయం చేసే వారు. అయితే ఆశించిన ఆదాయం రాలేదు.  దీంతో వ్యవసాయ సాగులో పద్ధతులు మార్చుకుని వినూత్నంగా సాగు చేపట్టారు. తన 13 ఎకరాల సాగు భూమిలో 11 జాతులకు చెందిన 1,634 పండ్ల చెట్లు పెంచుతున్నారు.

దీంతో ఆయనకు ఏడాది పొడవునా ఏదో ఒక రకం పంట చేతికి వస్తుండేది. అంతేకాక ఈ వ్యవసాయం ద్వారా ఏటా కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. దీంతో పాటు వారసత్వంగా వచ్చిన బియ్యం మిల్లును కూడా నడిపిస్తున్నారు. ఇక ఆయన వ్యవసాయ విధానం దేశ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇలా ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును రైతు రమేశ్‌ నాయక్‌ సాధిస్తున్నారు. దీంతో ఆయన ‘బిలియనీర్‌ ఫార్మర్‌’ అవార్డును దక్కించుకున్నారు.

ఢిల్లీలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ అవార్డు రావడంపై రమేశ్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి 1968లో బియ్యం మిల్లును ప్రారంభించారని తెలిపారు. అందులో రమేశ్ 1979 నుంచి అందులో పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం తనకున్న 13 ఎకరాల పొలంలో ఆధునిక పద్ధతుల్లో సేద్యాన్ని ప్రారంభించానని, పండ్ల పరిశ్రమను ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చారు.

ఇలా తమ వ్యాపారం రూ.10 కోట్లకు పెరిగిందని, ఇందులో సేద్యం ద్వారా కోటి రూపాయలు వస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయంలో తాను చేసిన కృషిని గుర్తించిన బెంగళూరు గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం.. ఈ పురస్కారానికి సిఫార్సు చేసిందని వివరించారు. సేద్యంలో నష్టం వస్తుందని చాలా మంది భావిస్తుంటారని.. సేంద్రియ, ఆధునిక విధానాల్లో సాగుచేస్తే నష్టాలు లేకుండా సేద్యం చేయవచ్చని రమేశ్‌ నాయక్‌ తెలిపారు. మరి.. రైతే రాజు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడిన ఈ రైతన్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి