iDreamPost

మంచి జీతాన్ని వదలి.. సాగు బాట పట్టిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్!

ఎంతో మంది యువత.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నగరాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. చాలా మంది జాబ్ లు వదిలేసి.. సొంతూర్లు వ్యవసాయం, వ్యాపారం వంటివి చేస్తుంటారు. అలానే తాజాగా ఓ వ్యక్తి సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. సాగుబాట పట్టి.. మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

ఎంతో మంది యువత.. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నగరాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. చాలా మంది జాబ్ లు వదిలేసి.. సొంతూర్లు వ్యవసాయం, వ్యాపారం వంటివి చేస్తుంటారు. అలానే తాజాగా ఓ వ్యక్తి సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. సాగుబాట పట్టి.. మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

మంచి జీతాన్ని వదలి.. సాగు బాట పట్టిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్!

నేటికాలంలో యువత ఉద్యోగాల పేరుతో గ్రామాలకు దూరంగా ఉంటూ పట్టణాల్లో జీవిస్తున్నారు. అయితే చాలా మంది ఎంతో ఇష్టంతో ఈ జాబ్స్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం కుటుంబం, సమాజం కోసం మాత్రమే ఆ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో కొందరికి వ్యవసాయంపై చాలా ఇష్టం ఉంటుంది. కానీ సమాజం ఏమనుకుంటుందో అని ఆ జాబ్స్ లోనే అసంతృప్తిగా ఉండిపోతారు. అందుకే నెలకు మంచి జీతం సంపాదిస్తున్న కూడా సంతోషంగా ఉండటం లేదు. కొందరు మాత్రం.. ఎవరికి గురించి పట్టించుకోకుండా..ఉద్యోగానికి రాజీనామా చేసి.. సాగు బాట పడుతున్నారు. ఇప్పటికే అలా పలువురు సాఫ్ట్ వేర్లు సాగు బాట పట్టి.. మంచి ఆదాయాన్ని అర్జిస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి జాబితాలోనే చేరారు.. విజయనగరం జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మరి.. ఆ పూర్తి స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గోవిందపురం గ్రామానికి చెందిన పోతినిండి అనంతబాబు స్టాప్ట్ వేర్ రంగంలో స్థిరపడ్డారు. కొంతకాలం క్రితం వరకు సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ అనంతబాబు నెలకు మంచి జీతం సంపాదిస్తూ ఉన్నాడు. అతడికి చిన్నతనం నుంచి వ్యవసాయంపై మక్కువ ఉండేది. అందుకే జాబ్ చేస్తున్నప్పటికీ ఆ వ్యవసాయం గురించి అనేక విషయాలు తెలుసుకుంటుండే వారు. ఈక్రమంలోనే కొంతకాలం  క్రితం అనంతబాబు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. అంతేకాక తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

సొంత గ్రామంలో వ్యవసాయం చేస్తూ సేంద్రియ ఎరువులతో ధాన్యంతో పాటు వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. సేంద్రియ సాగుతో చేసే ఉత్పత్తులకు మంచి గిరాకి ఉండే సంగతి అందరికి తెలిసిందే. ఆరోగ్యంగా ఉండాలంటే సైతం సేంద్రియ సాగుతో చేసిన ఉత్పత్తులను వినియోగించాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. అందుకే వారి ప్రోత్సహించడంతో ఆయా పంటలకు బాగా గిరాకీ పెరిగింది. అనంతబాబు గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉత్పత్తులను తమ ఇంటి వద్ద నుంచే ఆరోగ్య సమస్యలున్న వారికి నామమాత్రపు ధరకే విక్రయిస్తున్నారు. ప్రకృతిసాగును ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో గ్రామాల్లో ఈ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి పెరిగింది.

ఇక అనంతబాబు ప్రకృతి సాగులో భాగంగా వరి రకంలో కుంకం సాలు, ఒడిశా బాసుమతి, కాలాబట్టి, నవారా రకం వరిని  సాగు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా వ్యవసాయగా సాగులో పంటకాలం 4 నెలలే ఉంటుంది. అయితే  ఈ అరుదైన రకం సాగుకు  5 నెలల సమయం పడుతుదని ఆయన తెలిపారు. ఆయా సాగులో పంటకోత ప్రయోగం చేయగా ఎకరాకు 20-25 బస్తాలు వరకు దిగుబడి వస్తున్నట్లు చెప్పారు.

10 ఎకరాల్లో వరితో పాటు ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నట్లు అనంతబాబు పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన వరిని వినియోగిస్తే వ్యాధులు దూరమవుతాయని, అలాగే బీపీ, సుగర్‌, ఆస్తమా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పారు. పురాతన రకాలైన వరికి మార్కెట్లో బాగా గిరాకి ఉందని అనంతబాబు తెలిపారు. ఇలా సాఫ్ట్ వేర్ రంగాన్ని వదలి.. వ్యవసాయ బాట పట్టి.. మంచి లాభాలు అర్జిస్తూ… అనంతబాబు అందరికి ఆదర్శంగా నిలిచారు. మరి.. ఈ యువ రైతుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి