iDreamPost

రైతులకు అలెర్ట్.. ఆ పంటకు ఈ 5 రాష్ట్రాల్లో డిమాండ్!

మన దేశంలో చాలా మంది వ్యవసాయంపైనే ఆధార పడి బతుకున్నారు. అందుకే మారుతున్న కాలనికి తగినట్లు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ ఆదాయాన్ని అర్జించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ పంట విషయంలో శివ చంద్రుడు అనే రైతు ఆసక్తికర విషయాలు తెలిపారు.

మన దేశంలో చాలా మంది వ్యవసాయంపైనే ఆధార పడి బతుకున్నారు. అందుకే మారుతున్న కాలనికి తగినట్లు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ ఆదాయాన్ని అర్జించే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ పంట విషయంలో శివ చంద్రుడు అనే రైతు ఆసక్తికర విషయాలు తెలిపారు.

రైతులకు అలెర్ట్.. ఆ పంటకు ఈ 5 రాష్ట్రాల్లో డిమాండ్!

మన దేశంలో చాలా మంది వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. యువత రైతులు కూడా కొత్త కొత్త పద్ధతులతో వ్యవసాయ రంగంలో రాణిస్తున్నారు. కాలనికి తగినట్లు పంటలు వేస్తూ మంచి ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం మార్కెట్ లో ఏ పంటకు డిమాండ్ ఉంది, ఏ పంటకు లేదు అనే విషయాలు తెలుసుకోకుండా పంటలు వేస్తుంటారు. అలాంటి వారి కోసం పలువురు వ్యవసాయ నిపుణులు కీలక విషయాలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే రైతులకు అవసరమయ్యే ఓ వార్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

చాలా మంది తమ ప్రాంతంలో ఫలానా పంటకు డిమాండ్ లేదని పండించడం మానేస్తారు. అయితే ఆ పంటలకు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో డిమాండ్ ఉందనే విషయాన్ని మర్చిపోతారు. అలానే కంది పంట గురించి ఓ రైతు ఆసక్తిక విషయాలు చెప్పారు. అందులోను కొలంబో రకానికి చెందిన కందిపంటకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందని సదరు రైతు తెలిపారు. నంద్యాల జిల్లా మండ్లం గ్రామానికి చెందిన శివ చంద్రుడు అనే రైతు ఈ కొలంబో రకాని చెందిన పంటను పండిస్తున్నారు. దీనికి మార్కెట్ మంచి డిమాండ్ ఉందని ఆయన తెలిపారు.

ఎర్రరేగడి నేలల్లో ఈ పంట పండుతుందని  రైతు తెలిపారు. ఈ కంది పంట ఒక ఎకరా వచ్చేసి, 12 నుంచి 15 క్వింటాల పంట పండించడం జరుగుతుందని చంద్రుడు తెలిపారు. ఈపంటలకు తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల్లో మంచి డిమాండ్ ఉందని రైతు తెలిపారు. అందుకే తాను పండించిన కొలంబో రకానికి చెందిన పంటను ఈ ఐదు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు శివ చంద్రుడు తెలిపారు. రైతులు ఎప్పుడు కూడా నష్టపోకుండా లాభదాయకంగా పంటలు పండించే విధంగా చర్యలు తీసుకోవచ్చని చెప్పొకొచ్చారు.

ఈ కంది పంటను వర్షాకాలంలో వేయడం వల్ల అధిక కాపు వస్తుందట. ఈ రకం కంది పంటకు వర్ష ప్రభావం తక్కువ ఉన్నఎలాంటి నష్టం వాటిల్లదు. పైగా ఎకరాకు వచ్చేసి 8 క్వింటాలు పంట పండుతుందని శివ చంద్రుడు తెలిపారు. ప్రజలు తినేపప్పు ధాన్యానికి ఈ కంది పంట చాలా రుచిగా ఉంటుంది. మిగతా రకం కందిపంటలను మనం చూసినట్లయితే కొలంబో రకానికి చెందిన కంది బుడ్డకు వచ్చేసి నాలుగు విత్తనాలు మాత్రమే ఉంటాయి. ఒక కంది బుడ్డకు వచ్చేసి దాదాపుగా ఏడు కంది విత్తనాలు ఉంటాయి.

విత్తనాలు చాలా లావు సైజులో ఉంటాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో బుడ్డలు రావడంతో అధిక దిగుబగడి వస్తుంది.  వ్యాపారస్తులు ఈ కంది పంటను ఎక్కువగా కొనుగోలు చేస్తే.. రైతన్నలు వీటికి అలవాటుగా మారిపోతురని రైతు అంటున్నాడు. అంతేకాక  కొలంబో రకానికి చెందిన పంటను వేస్తేందుకు ఆసక్తి చూపిస్తారని రైతు తెలిపారు. ఇలా తక్కువ పెట్టుబడితో, తక్కువ నీటితో అధిక దిగుబడి పొందవచ్చు. మరి.. రైతు శివ చంద్రుడు చెప్పిన కందిపంట విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి