iDreamPost

Animal: వీడియో: ‘యానిమల్’ విలన్ బౌలింగ్ చూశారా? ఒక రేంజ్​లో..!

  • Author singhj Updated - 08:53 PM, Wed - 6 December 23

సెన్సేషనల్ హిట్ ‘యానిమల్’ మూవీలో విలన్​గా నటించిన బాబీ డియోల్​కు సంబంధించిన బౌలింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సెన్సేషనల్ హిట్ ‘యానిమల్’ మూవీలో విలన్​గా నటించిన బాబీ డియోల్​కు సంబంధించిన బౌలింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Author singhj Updated - 08:53 PM, Wed - 6 December 23
Animal: వీడియో: ‘యానిమల్’ విలన్ బౌలింగ్ చూశారా? ఒక రేంజ్​లో..!

డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాక్సాఫీస్ వద్ద మరోమారు మ్యాజిక్ చేశారు. ఆయన డైరెక్షన్​లో వచ్చిన ‘యానిమల్’ మూవీ సంచలన విజయం సాధించింది. రిలీజైన రోజు మార్నింగ్ షో నుంచి ఇప్పటిదాకా ఆ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్​తో దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా వసూళ్లు సాధించిందీ చిత్రం. రెండో రోజు కంటే మూడో రోజు రెవెన్యూస్ ఇంకా ఎక్కువ ఉండటం విశేషం. బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. డిసెంబర్ 25 (క్రిస్మస్) వరకు హిందీలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో లాంగ్ రన్ గ్యారెంటీగా కనిపిస్తోంది.

రణ్​బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’కు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ లభిస్తోంది. తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్​లో వసూళ్లు కొంత తగ్గినా.. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్​లో ఈవెనింగ్ షోస్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. తమిళనాడులోనూ ‘యానిమల్’ హవా నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా మేకింగ్, రణ్​బీర్ బీస్ట్ లెవల్ యాక్టింగ్, బాబీ డియోల్ స్టైలిష్ విలనిజంకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా వసూళ్లు ఒక రేంజ్​లో ఉన్నాయి. ఒక్క హిందీ వెర్షన్​ ద్వారానే ఇప్పటికి రూ.250 కోట్ల నెట్ వచ్చేసిందని తెలుస్తోంది. తెలుగు, తమిళంలో కలిపి రూ.30 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

‘యానిమల్’కు ముందు వరకు బాలీవుడ్​లో స్టార్ హీరోగా ఉన్న రణ్​బీర్.. ఈ ఫిల్మ్​తో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించారు. విలన్​గా యాక్ట్ చేసిన ప్రముఖ నటుడు బాబీ డియోల్ మీద కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. బాబీకి ఇది హిందీలో సూపర్ కమ్​బ్యాక్ అని ఆయన ఫ్యాన్స్​తో పాటు సినీ గోయర్స్ కూడా అంటున్నారు. 28 ఏళ్ల కెరీర్​లో ఎన్నో సినిమాల్లో నటించారు బాబీ డియోల్. కానీ ఏ మూవీకి రానిరీతిలో ‘యానిమల్​’తో ఆయన ఇమేజ్​ వేరే లెవల్​కు వెళ్లిపోయింది. బాబీ యాక్టింగ్​తో పాటు ఆయన ఫిజిక్​కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్​గా ముంబైలోకి ఒక థియేటర్​లో ఈ చిత్రాన్ని చూసిన ఆయన.. తన యాక్టింగ్​ను ప్రేక్షకులు మెచ్చుకోవడం, తన మీద ప్రేమ కురిపించడం చూసి ఎమోషనల్ అయ్యారు. తన క్యారెక్టర్​కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఏడ్చేశారు బాబీ డియోల్. అలాంటి ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్​లో భాగంగా బాలీవుడ్ టీమ్ తరఫున ఓ మ్యాచ్​లో ఆడారు బాబీ. అందులో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేస్తూ కనిపించారు. ఆయన వేసిన బాల్​ను బ్యాట్స్​మన్ మిస్సయ్యాడు. అయితే ఈ వీడియోకు ‘యానిమల్​’లోని బాబీ ఎంట్రీ బీజీఎం పెట్టి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. లార్డ్ బాబీ అంటే మామూలుగా ఉండదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు క్రికెట్ అభిమానులు.. బాబీ యాక్షన్ విరాట్ కోహ్లీలా ఉందని అంటున్నారు. మరికొందరేమో ఆఫ్ఘానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్​లా ఉందని చెబుతున్నారు. మరి.. బాబీ డియోల్ బౌలింగ్ వీడియోపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024: గుజరాత్ టైటాన్స్ కు మరో షాక్! పాండ్యా బాటలో మరో స్టార్ క్రికెటర్?

 

View this post on Instagram

 

A post shared by goswami editz (@cricket__crush__gp__multiverse)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి