iDreamPost
android-app
ios-app

రణబీర్ తో రష్మిక రొమాన్స్! విజయ్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్!

  • Author ajaykrishna Updated - 01:42 PM, Thu - 12 October 23
  • Author ajaykrishna Updated - 01:42 PM, Thu - 12 October 23
రణబీర్ తో రష్మిక రొమాన్స్! విజయ్ ని ఆడేసుకుంటున్న నెటిజన్స్!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ క్రేజీ ఫ్యాన్ బేస్ దక్కించుకుంటాయి. హీరో – డైరెక్టర్స్ గురించి కాదు.. హీరోహీరోయిన్స్ గురించి చెప్పుకుందాం. రౌడీ హీరో విజయ్ దేవరకొండ – నేషనల్ క్రష్ రష్మిక మందన జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల నుండి వీళ్ల జంటను ఫాలో అవుతున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా వీరిద్దరూ ఎప్పుడు జంటగా కనిపించినా.. ఆ రోజు సోషల్ మీడియా మొత్తం షేక్ చేసేస్తుంటారు. ప్రస్తుతం విజయ్ తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు.. రష్మిక కూడా తన సినిమాలతో బిజీగా ఉంది. రష్మిక ఓవైపు పుష్ప 2 చేస్తూనే.. మరోవైపు యానిమల్ మూవీ చేసింది.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ వైల్డ్ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. డిసెంబర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అవుతోంది. కాగా.. సినిమా రిలీజ్ కి మెల్లగా టైమ్ దగ్గర పడుతుండటంతో.. మేకర్స్ సినిమా నుండి ఒక్కో అప్డేట్ రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. తాజాగా యానిమల్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో రణబీర్ – రష్మికల మధ్య ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా రష్మిక ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఏంటి.. రణబీర్ తో ఒక్క సాంగ్ లోనే అన్ని లిప్ లాక్స్ చేసింది రష్మికనా? అని ఆశ్చర్యపోయారు.

కట్ చేస్తే.. సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఓవైపు సందీప్ కి క్రేజీ డైరెక్టర్ గా పేరు తీసుకొస్తూ.. రష్మికపై డిఫరెంట్ కామెంట్స్ కూడా వచ్చేలా చేసింది సాంగ్. పైగా అర్జున్ రెడ్డిలో మధురమే సాంగ్ ఛాయలు చాలా ఉన్నాయి. అంటే.. ఆ రేంజ్ లో ప్రతీ మూమెంట్ లో ఇద్దరి మధ్య కిస్ సీన్ పెట్టేశాడు సందీప్. ఈ క్రమంలో రష్మికతో పాటు విజయ్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకంటే.. విజయ్ రష్మిక ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని అంతా అనుకుంటున్నారు. వీరిద్దరూ చేసిన రెండు సినిమాలలో ముద్దు సీన్స్ ఉన్నాయి. సో.. ఇప్పుడు రష్మిక రణబీర్ ని కిస్ చేయడంతో.. విజయ్ ని మెన్షన్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. మరి రొమాన్స్ అనేది ఈ సాంగ్ వరకేనా లేక సినిమాలో ఇలాంటి స్టఫ్ చాలా ఉందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి యానిమల్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş