Prabhas Birthday Updates: లైన్ లో మూడు సినిమాలు.. ట్రెండింగ్ లో క్రేజీ ట్రీట్స్!

లైన్ లో మూడు సినిమాలు.. ట్రెండింగ్ లో క్రేజీ ట్రీట్స్!

  • Author ajaykrishna Published - 11:30 AM, Thu - 12 October 23
  • Author ajaykrishna Published - 11:30 AM, Thu - 12 October 23
లైన్ లో మూడు సినిమాలు.. ట్రెండింగ్ లో క్రేజీ ట్రీట్స్!

అభిమాన హీరోలకు సంబంధించి సినిమాలే కాదు.. వారి బర్త్ డేలు వచ్చిన ఫ్యాన్స్ సంబరాలు గ్రాండ్ గానే ఉంటాయి. ఒక్కోసారి హీరో బర్త్ డే సెలెబ్రేషన్స్ కూడా సినిమా రిలీజైన ఫస్ట్ డే ఉన్న హంగామా కనిపిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే వస్తుంది. అదే టైమ్ లో దసరా పండుగ కూడా వస్తుండటంతో ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే.. ప్రభాస్ సినిమాలకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఏమైనా మేకర్స్ రిలీజ్ చేస్తారేమో అని. ప్రభాస్ నుండి ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీ సలార్. కేజీఎఫ్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ఇది. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు.

క్రిస్మస్ ఫెస్టివల్ సందర్బంగా సలార్.. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే.. సలార్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి కూడా షూటింగ్ జరుపుకుంటుంది. దానితో పాటు డైరెక్టర్ మారుతీతో ఓ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్ట్ లపై ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా సలార్ ముందుగా వస్తుంది కాబట్టి.. ఆ సినిమా నుండి ఇప్పటిదాకా టీజర్ తప్ప ఏం రాలేదు. సో.. డార్లింగ్ బర్త్ డేకి ట్రైలర్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అది కుదరకపోతే కనీసం ఫస్ట్ సింగిల్ అయినా వదిలితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక కల్కి నుండి ఆల్రెడీ టీజర్ వచ్చింది. అదికూడా ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెంచేసింది. నాగ్ అశ్విన్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడని అందరికీ అర్థమైంది. సో.. డార్లింగ్ కి సంబంధించి కల్కి నుండి ఏదైనా పోస్టర్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే.. కల్కి టీమ్ అందులో వర్క్ చేస్తున్న ప్రతీ ఆర్టిస్ట్ బర్త్ డేకి పోస్టర్స్ తో విష్ చేస్తోంది. మరోవైపు డైరెక్టర్ మారుతీ సినిమా నుండి ఇప్పటిదాకా కనీసం టైటిల్ కూడా రివీల్ కాలేదు. సో.. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ మూడు సినిమాల నుండి క్రేజీ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ.. ఫైనల్ గా మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు. సో.. ఇటీవల సలార్ వాయిదా వేసి నిరాశపరిచారు కదా.. కనీసం సలార్ నుండి బిగ్ ట్రీట్ ఉంటుందని భావిస్తున్నారు. మరి ప్రభాస్ బర్త్ డే పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి కామెంట్స్ లో తెలపండి.

Show comments