iDreamPost
android-app
ios-app

90 కిడ్స్ ఫేవరెట్ క్రికెటర్ ఫ్లింటాఫ్.. ఇలా అయిపోయాడేంటి?

  • Author Soma Sekhar Published - 05:08 PM, Sat - 9 September 23
  • Author Soma Sekhar Published - 05:08 PM, Sat - 9 September 23
90 కిడ్స్ ఫేవరెట్ క్రికెటర్ ఫ్లింటాఫ్.. ఇలా అయిపోయాడేంటి?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. కాలంతో పాటుగా మనుషులు కూడా మారుతారు అంటే ఏమో అనుకున్నాం. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే.. అది నిజమే అనిపిస్తుంది. కాగా.. 90వ దశకంలో క్రికెట్ ప్రేమికులను తన ఆటతో మెస్మరైజ్ చేసిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ అండ్రూ ఫ్లింటాఫ్ ఒకడు. వరల్డ్ క్రికెట్ కు ఇంగ్లాండ్ టీమ్ అందించిన దిగ్గజ ఆల్ రౌండర్లలో అండ్రూ ఫ్లింటాఫ్ ఒకడు. గత కొంతకాలంగా ఫ్లింటాఫ్ వార్తల్లో కనిపించడం లేదు. దానికి కారణం అతడు రేసింగ్ లో కారు ప్రమాదానికి గురికావడమే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ అతడు తొలిసారి ప్రపంచానికి కనిపించాడు. దీంతో అతడిని చూసిన ఫ్యాన్స్ ఫ్లింటాఫ్ ఏంటి ఇలా అయిపోయాడు? పాపం అంటూ బాధపడుతున్నారు.

అండ్రూ ఫ్లింటాప్.. ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడనే చెప్పాలి. ఇక ప్రత్యేకించి 90 కిడ్స్ కు ఫ్లింటాఫ్ ఫేవరెట్ క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో అసలు సిసలైన ఆల్ రౌండర్ కు పర్యాయ పదంగా మారాడు ఫ్లింటాఫ్ మారాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా.. 2007లో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ తో గొడవపడ్డాడు ఫ్లింటాప్. ఈ గొడవతో ఇండియా ఫ్యాన్స్ కు కూడా సుపరిచితుడిగా మారాడు. కాగా క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వాత మీడియాలో కనిపించడం తగ్గించేశాడు.

ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్ లో ప్రముఖ టీవీ ఛానెల్ బీబీసీ నిర్వహించిన ‘టాప్ గేర్’ షోలో భాగంగా ఎపిసోడ్ షూట్ చేస్తుండగా.. కారు ప్రమాదానికి గురైయ్యాడు ఫ్లింటాఫ్. దీంతో అతడిని వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి మళ్లీ ఇప్పటి వరకు దాదాపు 9 నెలలు ఫ్లింటాఫ్ బయటి ప్రపంచానికి కనిపించలేదు. తాజాగా ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ చూడ్డానికి వచ్చాడు. దీంతో అన్ని కెమెరాలు ఫ్లింటాఫ్ పైనే దృష్టిపెట్టాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా ఉన్న రాబ్ కీ.. ఫ్లింటాఫ్ కి మంచి మిత్రుడు. దీంతో రాబ్ కీ అతడిని మ్యాచ్ చూసేందుకు ఆహ్వానించాడు.

ఇక ఫ్లింటాఫ్ మ్యాచ్ చూసేందుకు రావడంతో.. అందరి దృష్టి అతడిపైనే పడింది. ఎలా ఉండే ఫ్లింటాఫ్ ఇలా మారిపోయాడు ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు. పాలిపోయిన ముఖంతో ముక్కుపై, పెదవి దగ్గర గాయాలతో గుర్తుపట్టకుండా మారిపోయాడు. ఆరడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువుతో హాలీవుడ్ హీరోలా ఉండే ఫ్లింటాఫ్ ను ఇలా చూడటంతో.. అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్ చూసేందుకు ఇంగ్లాండ్ స్టాఫ్ డ్రెస్ కోడ్ వేసుకుని వచ్చాడు. దీంతో కొందరు నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్లింటాఫ్ రాబోయే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ టీమ్ కు ఏమైనా సేవలు అందించనున్నాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.