iDreamPost
android-app
ios-app

‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన WWE సూపర్ స్టార్స్! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 11:45 AM, Sat - 9 September 23
  • Author Soma Sekhar Published - 11:45 AM, Sat - 9 September 23
‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేసిన WWE సూపర్ స్టార్స్! వీడియో వైరల్..

హైదరాబాద్ వేదికగా WWE సూపర్ స్టార్ స్పెక్టేకిల్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు 28 మంది అంతర్జాతీయ రెజ్లర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు WWE సూపర్ స్టార్ జాన్ సీనా. ఇక ఈ ఈవెంట్ లో భారత రెజ్లర్లు కూడా పాల్గొంటున్నారు. వారిలో వీర్ మహాన్, జిందార్ మహాల్, సంగా ఉన్నారు. ఇక వీరు WWE వెటరన్ స్టార్లు అయిన కెవిన్ ఓవెన్స్, శామీ జేన్, డ్రూ మెంటైర్ తో పోటీపడ్డారు. నలుగురు పోటీ పడాల్సిన ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ఆరుగురు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఆస్కార్ అవార్డు పొందిన టాలీవుడ్ సాంగ్ అయిన నాటు నాటు పాటకు ఆరుగురు రెజ్లర్లు స్టెప్పులు వేశారు.

నాటు నాటు సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు విదేశీ రాయబారులు, ఫ్యాన్స్ కూడా డాన్స్ లు వేశారు. ఇక ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం WWE సూపర్ స్టార్లే. హైదరాబాద్ వేదికగా WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనడానికి 28 మంది రెజ్లర్లు హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా జరిగిన ఫైట్ లో ఇండియాకు చెందిన ముగ్గురు రెజ్లర్లు పాల్గొన్నారు. భారత రెజ్లర్లు వీర్ మహాన్, జిందర్ మహాల్, సంగాలు WWE వెటరన్ స్టార్లు అయిన కెవిన్ ఓవెన్స్, శామీ జైన్, డ్రూ మెకింటైర్ తో పోటీపడ్డారు. ఈ పోరులో కెవిన్, ఓవెన్స్, డ్రూ జోడీ విజయం సాధించింది.

అయితే మ్యాచ్ అనంతరమే అసలైన మజా స్టార్ట్ అయ్యింది. మ్యాచ్ అనంతరం ఆరుగురు రెజ్లర్లు కలిసి నాటు నాటు సాంగ్ కు స్టేజిపైనే స్టెప్పులు వేశారు. నాటు నాటు సాంగ్ కు వారి డ్యాన్స్ చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్లు వేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారింది. అదీకాక ఈ మ్యాచ్ లో డ్రూ టీమిండియా జెర్సీ వేసుకుని వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. మరి WWE సూపర్ స్టార్లు నాటు నాటు సాంగ్ కు స్టెప్పులు వేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet