ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమై హుటాహుటిన ఆయనను మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆయన ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన తీవ్రమైన కడపు నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆయన హెల్త్ బులిటిన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, 2023 ఫిబ్రవరి 12న ఎస్. అబ్దుల్ నజీర్ ను ఏపీ 24వ గవర్నర్ గా భారత రాష్ట్రపతి నియమించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసుకు సంబంధించి.. ఏపీ సీఐడీ తాజాగా మాజీ మంత్రి నారాయణకు నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు […]