iDreamPost

ఆనంద్ మహీంద్రాకు బహుమతిగా అంబాసిడర్..! ఎవరిచ్చారంటే ?

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. పెద్దగా పరిచయం అవసరం లేదు. కారణం.. ఈయన పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాకుండా.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా తనకు గిఫ్ట్ గా వచ్చిన అంబాసిడర్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా.. పెద్దగా పరిచయం అవసరం లేదు. కారణం.. ఈయన పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాకుండా.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా తనకు గిఫ్ట్ గా వచ్చిన అంబాసిడర్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఆనంద్ మహీంద్రాకు బహుమతిగా అంబాసిడర్..! ఎవరిచ్చారంటే ?

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిన క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇలా కేవలం న్యూసే కాకుండా.. ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. మరికొందరు అయితే ప్రపంచంలో జరిగే ప్రత్యేక సంఘటనలను షేర్ చేస్తుంటారు. మరికొందరు ఇతరుల ప్రతిభను ప్రపంచానికి తెలిసే..పోస్టులు పెడుతుంటారు. అలా చాలా మంది సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూపుల అధినేత ఆనంద్ మహీంద్రా.

ఆనంద్ మహీంద్రా.. పెద్దగా పరిచయం అవసరం లేదు. కారణం.. ఈయన పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాకుండా.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఎన్నెన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటారు. అలానే ప్రతిభావంతులైన వారిని గుర్తించి..తన ఎక్స్ వేదికగా అందరికి తెలియజేస్తుంటారు. అంతేకాక కొత్త కొత్త ఇన్వోవేషన్లను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలానే తన వ్యక్తిగత విషయాలన కూడా షేర్ చేసుకుంటారు. తాజాగా హిందూస్తాన్ అంబాసిడర్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి మనమెందుకు తయారు చేయకూడదన్నారు.

ఆనంద్ మహీంద్రా హిందూస్తాన్ అంబాసిడర్ స్కెల్ మోడల్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీటిని మహీంద్రా ఆటోమోటివ్ చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ నుంచి ఆనంద్ మహేంద్ర గిఫ్ట్ గా పొందారు. అదే విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇలాంటి బహుమతిగా పొందటం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు ప్రతాప్ బోస్ నుంచి గిఫ్ట్ అందుకున్నానని, తన జ్ఞాపకాల్లో అంబాసిడర్ కారుకు ఓ ప్రత్యేకత ఉందని  చెప్పుకొచ్చారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల తన ఎక్స్ ఖాతాలో హిందూస్తాన్ అంబాసిడర్ స్కెల్ మోడల్స్ షేర్ చేశారు. వీటిని మహీంద్రా ఆటోమోటివ్ చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ నుంచి గిఫ్ట్‌గా పొందినట్లు, ఇలాంటి గిఫ్ట్ పొందటం తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇలా పేర్కొంటూనే ఈ రోజు ప్రతాప్ బోస్ నుంచి గిఫ్ట్ అందుకున్నాను. నా జ్ఞాపకాల్లో అంబాసిడర్ కారుకు ఓ ప్రత్యేకత ఉందని అన్నారు.

అంబాసిడర్ కారు నేటి తరంలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం ఎంతో మందికి డ్రీమ్ కారు అది. ఆ కాలం నాటి అంబాసిడర్ కార్లు ఇప్పటికీ రోడ్ల మీద అక్కడక్కడా దర్శనమిస్తుంది. ఇలాంటి గొప్ప కార్లు స్కెల్ మోడల్స్ ద్వారా పేరుగాంచేందుకు అర్హమైనవని మహీంద్రా అన్నారు. ఇక ప్రతాప్ బోస్  నుంచి ఆనంద్ మహీంద్రా బహుమతిగా పొందిన అంబాసిడర్ స్కెల్ మోడల్‌లలో ఒకటి బ్లాక్, మరొకటి గోధుమ రంగులో ఉన్నాయి. ఈ స్కేల్ మోడల్‌లను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ఇలాంటి స్కేల్ మోడల్‌లను మనం ఎందుకు నిర్మించడం లేదని ఆయన తన సోషల్ మీడియా ద్వారా బోస్‌ను అడిగారు. ప్రస్తుతం ఈ అంబాసిడర్ కార్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి