iDreamPost

Mukesh Ambani: వీడియో: జై శ్రీరామ్‌ నామాలతో విరాజిల్లిన అంబానీ నివాసం!

  • Published Jan 22, 2024 | 1:32 PMUpdated Jan 22, 2024 | 1:32 PM

అయోధ్యతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, వీధులు, ఇళ్ళు ఇలా ప్రతి చోట.. రామ మందిర ప్రతిష్ఠాపన సంధర్బంగా కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో ప్రముఖ ఇండస్ట్రిలియలిస్ట్ ముకేశ్ అంబానీ ఇంట నెలకొన్న సందడి.. సోషల్ మీడియాలో చూపరులకు కనువిందు కలిగిస్తోంది.

అయోధ్యతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, వీధులు, ఇళ్ళు ఇలా ప్రతి చోట.. రామ మందిర ప్రతిష్ఠాపన సంధర్బంగా కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో ప్రముఖ ఇండస్ట్రిలియలిస్ట్ ముకేశ్ అంబానీ ఇంట నెలకొన్న సందడి.. సోషల్ మీడియాలో చూపరులకు కనువిందు కలిగిస్తోంది.

  • Published Jan 22, 2024 | 1:32 PMUpdated Jan 22, 2024 | 1:32 PM
Mukesh Ambani: వీడియో:  జై శ్రీరామ్‌ నామాలతో విరాజిల్లిన అంబానీ నివాసం!

త్రేతాయుగపు శ్రీరాముని పట్టాభిషేక శోభ మరలా వచ్చిందా అన్నట్లుగా.. నేడు అయోధ్య అంతటా పండుగ వాతావరణం నెలకొంది. వందల సంవత్సరాల నాటి కల నెరవేరింది. యావత్ భారతదేశం ఈ మధుర క్షణాలను వీక్షించడం కోసం..ఇప్పటివరకు ఎంతో ఆతృతగా ఎదురు చూసింది. ప్రాణ ప్రతిష్ట జరిగేది అయోధ్యలోనే అయినా.. ఆ సందడి వాతావరణం మాత్రం దేశంలోని ప్రతి ఒక్క దేవాలయంలో.. ప్రతి ఒక్కరి ఇంట్లో నెలకొంది. ఎక్కడ చూసినా రామ నామ స్మరణతో భక్తులు తన్మయత్వంలో మునిగి తేలుతున్నారు. ప్రతి ఇంట ప్రతి చోట ఇదే హడావిడి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇల్లు ప్రత్యేకంగా నిలిచింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబాని గురించి అందరికి తెలుసు. అయోధ్యలో రామ ప్రతిష్టాపన సందర్బంగా ముకేశ్ అంబాని నివాసమైన అంటిలియా.. అంత్యంత సుందరంగా.. జై శ్రీరామ్ నామాలతో.. అలంకరించబడింది. 27 అంతస్తుల ఈ భవనం మొత్తం రాముడి నామాలతో దివ్యంగా వెలిగిపోయింది. అలాగే ఆ ఇంటి ప్రాంగణం అంతా కూడా.. శ్రీరాముడి బ్యానర్లు, లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ భవన ప్రాంగణం ఎంతో ముచ్చటగా చూపరులను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో సామజిక మాధ్యమాలలో కూడా చూపరులను కట్టి పడేస్తుంది. అలాగే మరో పక్క దేశంలోని అన్ని ఆలయాలు కూడా.. రామ నామ జపంతో.. మునిగిపోయాయి. ఓ రకంగా ప్రతి ఒక్కరిలోనూ ఈ ఆనందం విరాజిల్లుతోంది చెప్పి తీరాలి.

ఇక ఆ రామ జన్మ భూమిలో బాల రాముడు కొలువు తీరి.. అందరిని మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు. ఆ ప్రాంతమంతా ఎంతో మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక్షంగా క్షించేందుకు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక్షంగా పరోక్షంగా ఎంతో మంది ప్రజలు.. పాలుపంచుకుంటున్నారు. ఇకపై అయోధ్య రామ మందిరం మహా పుణ్య క్షేత్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పడంలో.. ఎటువంటి అతిశేయోక్తి లేదు. మరి, ప్రస్తుతం సామజిక మాధ్యమాలలో సందడి చేస్తున్న.. అంబాని నివాసమైన అంటిలియాపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి