iDreamPost

తమన్నాపై అంబానీ కేసు.. ఈ IPL గొడవేంటి? పూర్తి వివరాలు

ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు తమన్నాకి పోలీసులు నోటీసులు పంపించారు. అయితే కేసు వేసింది ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్ అనే సంస్థ. అసలు ఈ కేసుకి, తమన్నాకి ఉన్న లింక్ ఏంటి? పూర్తి కథనం మీ కోసం.

ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు తమన్నాకి పోలీసులు నోటీసులు పంపించారు. అయితే కేసు వేసింది ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్ అనే సంస్థ. అసలు ఈ కేసుకి, తమన్నాకి ఉన్న లింక్ ఏంటి? పూర్తి కథనం మీ కోసం.

తమన్నాపై అంబానీ కేసు.. ఈ IPL గొడవేంటి? పూర్తి వివరాలు

సెలబ్రిటీలన్నాక వారికున్న క్రేజ్ కి పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం సహజమే. ఆయా కంపెనీలకు చెందిన ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదిస్తుంటారు. ఇటీవల కాలంలో పలు రకాల యాప్స్ ని కూడా సదరు సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. యావరేజ్ సెలబ్రిటీల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కటో ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అని, ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ ని, స్టాక్ మార్కెట్ యాప్స్ అని రకరకాల యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా తమన్నా కూడా ఒక యాప్ ని ప్రమోట్ చేసింది. అయితే అదే ఆమె కొంప ముంచింది. ఫెయిర్ ప్లే అనే యాప్ ని తమన్నా ప్రమోట్ చేసింది. ఇది ఫెయిర్ ప్లే అనేది ఒక బెట్టింగ్ యాప్. ఈ యాప్ లో క్రికెట్ మ్యాచ్ లు చూడాలంటూ తమన్నా ప్రమోట్ చేసింది. ఇంకేముందు సీన్ కట్ చేస్తే ఆమెకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు పంపించారు. 

ముకేశ్ అంబానీకి చెందిన వయాకామ్ 18 సంస్థకు చెందిన జియో సినిమా యాప్ లో ఐపీఎల్ మ్యాచ్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేయడానికి కావలసిన డిజిటల్ హక్కులను వయాకామ్ సంస్థ కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. మరి ఇన్ని కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కుంటే.. అనధికారికంగా స్ట్రీమింగ్ చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారు? ఎంతో పేరు, పలుకుబడి ఉన్న తమన్నా అలాంటి యాప్ ని ప్రమోట్ చేస్తే కేసు వేయకుండా ఎలా ఉంటారు? పలానా సబ్బు వాడండి అంటేనే వెనకా ముందు చూసుకోకుండా తమన్నా చెప్పింది కదా అని కొనేసి వాడేస్తుంటారు. అలాంటిది ఐపీఎల్ మ్యాచులు చూడమని చెప్తే చూడకుండా ఉంటారా? దీని వల్ల వయాకామ్ సంస్థకి 100 కోట్లు నష్టం వచ్చిందని సంస్థ యాజమాన్యం చెబుతుంది. ఇందులో తమన్నా మాత్రమే కాదు.. సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ప్రముఖ సింగర్ బాద్ షా ఉన్నారు. వీరందరికీ పోలీసులు నోటీసులు పంపించారు. ఈ నెల 29 లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tamannaa

ఈ ఫెయిర్ ప్లే యాప్ అనేది మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ యాప్ కి సబ్సిడరీ యాప్. క్రికెట్ తో పాటు పోకర్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్బాల్ కార్డు వంటి అనేక ఇతర గేమ్స్ కి సంబంధించిన బెట్టింగ్ లను ఈ యాప్ లో నిర్వహిస్తారు. లైవ్ గేమ్స్ లో ఇల్లీగల్ బెట్టింగ్ లను నిర్వహిస్తారు. గత ఏడాది రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ లిద్దరూ ఈ యాప్ ని ప్రమోట్ చేయడంతో మహాదేవ్ బెట్టింగ్ యాప్ అనేది హెడ్ లైన్స్ లోకి వచ్చింది. అప్పట్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రణబీర్ కపూర్, శ్రద్దా కపూర్ లకు విచారణ కోసం సమన్లు జారీ చేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ను సౌరవ్ చంద్రకర్, రవి ఉప్పల్  అనే ఇద్దరు వ్యక్తులు దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఛత్తీస్ గఢ్ లోని బిలాయికి చెందిన వ్యక్తులు.

అయితే గత ఏడాది ఫిబ్రవరి నెలలో దుబాయ్ లో 200 కోట్ల ఖర్చుతో సౌరబ్ చంద్రకర్ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్ళి కోసం ఆన్ లైన్ పేమెంట్స్ కాకుండా పూర్తిగా క్యాష్ రూపంలోనే పేమెంట్ జరిగింది. దీంతో ఒక్కసారిగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మహాదేవ్ యాప్ కేసుని పోలీసులు ఏడాదికి పైగా విచారణ చేస్తూనే ఉన్నారు. ఛత్తీస్ గఢ్ కి చెందిన పలు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్స్ కి ఈ యాప్ తో సంబంధాలు ఉన్నట్టు తమ దర్యాప్తులో తేలిందని గతంలో ఆరోపించారు. ఈ యాప్ ద్వారా దాదాపు 6 వేల కోట్లు స్కామ్ చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ కి సబ్సిడరీ యాప్ గా ‘ఫెయిర్ ప్లే’ యాప్ ఉంది. ఇందులో ఇల్లీగల్ బెట్టింగ్ నిర్వహించడం.. ఐపీఎల్ మ్యాచులు ప్రసారం చేస్తున్నారు. వీటిని తమన్నా సహా ఇతర సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం వల్ల రెండు రకాల నేరాలను ప్రోత్సహిస్తున్నట్టు పోలీసులు భావించి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి