iDreamPost

IPL 2024: అంబానీ ఒక్క నిర్ణయం.. మూడు జట్లను ముంచేసింది! ఎలాగంటే?

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేష్ అంబానీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏకంగా మూడు జట్లను నిలువునా ముంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేష్ అంబానీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏకంగా మూడు జట్లను నిలువునా ముంచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: అంబానీ ఒక్క నిర్ణయం.. మూడు జట్లను ముంచేసింది! ఎలాగంటే?

ఒక వ్యక్తిగానీ లేదా ఒక సంస్థ గానీ తీసుకున్న నిర్ణయం ఇతర వాటిపై ప్రభావం చూపుతుందా? అంటే కొన్ని కొన్ని సార్లు చూపుతుందనే చెప్పాలి. వ్యక్తిగతంగా తీసుకున్న ఏ నిర్ణయం అయినాగానీ ఎంతో కొంత ఇతరులపై ప్రభావం చూపుతుంది. అలా ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ ఓనర్ ముకేష్ అంబానీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏకంగా మూడు జట్లను నిలువునా ముంచేసింది. అదేంటి? అంబానీ తీసుకున్న నిర్ణయంతో మూడు జట్లకు నష్టం ఎలా కలిగింది? అని మీకు అనుమానం రావొచ్చు. పదండి అంబానీ నిర్ణయంతో మూడు జట్లు ఎలా మునిగాయో తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికంటే ముందే సంచలనానికి తెరలేపింది ముంబై ఇండియన్స్. క్యాష్ ఆన్ ట్రేడింగ్ విధానంలో గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసి ముంబై టీమ్ కు కెప్టెన్ గా చేసింది. ఇది అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంఘటన. ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ తీసుకున్న ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఇటు ముంబై ఇండియన్స్, గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ నిండా మునిగిపోయాయి. అదెలాగంటే?

హార్దిక్ పాండ్యాను గుజరాత్ నుంచి క్యాష్ ఆన్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయడానికి వీలుగా.. అంతకు ముందు వేలంలో రూ. 17.50 కోట్లకు కొన్న ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ట్రేడింగ్ ద్వారా ఆర్సీబీకి ఇచ్చేసింది. ఐపీఎల్ లో ఇంపాక్ట్ రూల్ ఉన్నప్పటికీ గ్రీన్ ను ఇంత మెుత్తం పెట్టి ట్రేడింగ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంపాక్ట్ రూల్ వల్ల ఆల్ రౌండర్లకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందన్న విషయం మనందరికి తెలిసిందే. అసలు గ్రీన్ వైపు ఆర్సీబీ మెుగ్గు చూపకపోతే.. పాండ్యాను ముంబై తీసుకునేదే కాదు. దీంతో అతడు గుజరాత్ లోనే ఉండేవాడు.

ఇక ఇప్పుడు పాండ్యా వెళ్లిపోవడంతో గుజరాత్ పరిస్థితి కూడా పూర్తిగా దిగజారీపోయింది. ఈ సీజన్ లో గుజరాత్ 10 మ్యాచ్ ల్లో 4 విజయాలతో 8వ ప్లేస్ లో ఉంటే.. ముంబై 9వ స్థానం, ఆర్సీబీ చివరి స్థానంలో ఉసూరుమంటున్నాయి. అంబానీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఈ మూడు జట్లు బలైయ్యాయి. మరి అంబానీ తీసుకున్న ఆ ఒకే ఒక్క నిర్ణయమే మూడు జట్లను ముంచేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి