iDreamPost
android-app
ios-app

హనుమాన్ హీరోలా మీరు కూడా సూపర్ హీరో అవ్వచ్చు! ఎలా అంటే?

  • Published May 17, 2024 | 10:15 PMUpdated May 17, 2024 | 10:15 PM

హనుమాన్ హీరోలా మీరు కూడా సూపర్ హీరో అవుతారా? సూపర్ హీరోలా మీరు కూడా జనాన్ని కాపాడతారా? సూపర్ పవర్స్ లేవు కదా ఎలా అని అనుకోకండి. ఇంట్లో పవర్ ఉంటే చాలు.. మీరు కూడా ప్రజల్ని కాపాడే సూపర్ హీరో అవ్వచ్చు.

హనుమాన్ హీరోలా మీరు కూడా సూపర్ హీరో అవుతారా? సూపర్ హీరోలా మీరు కూడా జనాన్ని కాపాడతారా? సూపర్ పవర్స్ లేవు కదా ఎలా అని అనుకోకండి. ఇంట్లో పవర్ ఉంటే చాలు.. మీరు కూడా ప్రజల్ని కాపాడే సూపర్ హీరో అవ్వచ్చు.

  • Published May 17, 2024 | 10:15 PMUpdated May 17, 2024 | 10:15 PM
హనుమాన్ హీరోలా మీరు కూడా సూపర్ హీరో అవ్వచ్చు! ఎలా అంటే?

సూపర్ హీరో అంటే సినిమాల్లోనే ఉంటారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా హనుమాన్ సినిమా కూడా వచ్చింది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. సూపర్ హీరో అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఇలా అనుకునే మీరు కూడా సూపర్ హీరో అవ్వచ్చు. హనుమాన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. సూపర్ హీరో అవ్వాలంటే సూపర్ పవర్స్ ఉండక్కర్లేదు.. మన శక్తికి మించి పోరాడితే చాలు అని విలన్ చిన్నప్పటి పాత్రకు అతని తల్లి చెబుతుంది. అయితే విలన్ కాబట్టి స్వార్థం కోసం సూపర్ హీరో అవ్వాలనుకున్నాడు. అయితే మంచి కోసం సూపర్ హీరో అవ్వచ్చు. మంచి చేయాలన్న ఆలోచన ఉంటే మీరే సూపర్ హీరో. 

సూపర్ హీరో ఎలా అవ్వాలంటే?:

టెక్నాలజీ పెరిగాక ఆన్ లైన్ స్కామ్స్, ఫ్రాడ్స్ ఎక్కువైపోయాయి. మెసేజులు పంపి, లింకులు పంపి, ఫోన్లు చేసి ఏదో రకంగా మోసాలకు పాల్పడుతున్నారు. మీరు కనుక ఇలా మోసపోయినట్లైతే కనుక.. మీలా ఎవరూ మోసపోకూడదు అని మీరు అనుకుంటే కనుక ఆ నంబర్ పై ఫిర్యాదు చేయవచ్చు. అది కూడా జస్ట్ ఒకే ఒక వెబ్ సైట్ లోకి వెళ్లి చేయచ్చు. మోసపోయిన వాళ్ళే కాదు.. మోసం చేస్తారు అన్న అనుమానిత నంబర్స్ నుంచి స్పామ్ మెసేజ్ లు, ఫోన్లు వచ్చినా కూడా మీరు ఈ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలు మోసపోకుండా ఉండడం కోసం భారత ప్రభుత్వం చక్షు అనే పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ లోకి వెళ్లి కొన్ని స్టెప్స్ ఫాలో అయితే చాలు.. ఆ నంబర్ నుంచి వేరొకరికి స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజులు వెళ్లకుండా ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. 

ఎలా ఫిర్యాదు చేయాలంటే?:

  • లింక్ పై క్లిక్ చేయాలి. లేదా గూగుల్ లోకి వెళ్లి చక్షు పోర్టల్ అని టైప్ చేస్తే మీకు ఒక లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. 
  • ఆ తర్వాత మీడియం ఆఫ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ లో కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ లలో ఏదో ఒక ఆప్షన్ ని ఎంచుకోవాలి. అంటే కాల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మీకు స్పామ్ మెసేజులు గానీ స్పామ్ కాల్స్ వస్తే దాన్ని ఎంచుకోవాలి. 
  • ఆ తర్వాత సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ కేటగిరీని ఎంచుకోవాలి. అంటే ఆన్ లైన్ జాబ్, లాటరీ, గిఫ్టులు, లోన్ ఆఫర్స్, ఫేక్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ ఇలా దేనికి సంబంధించిన స్పామ్ కాల్స్ లేదా స్పామ్ మెసేజులు వస్తే ఆ ఆప్షన్ ని ఎంచుకోవాలి. 
  • ఆ తర్వాత స్పామ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ని అప్లోడ్ చేయాలి. 
  • సస్పెక్టెడ్ ఫ్రాడ్ తేదీ, సమయాన్ని ఎంపిక చేయాలి. 
  • ఫిర్యాదు వివరాలు ఇవ్వాలి. 
  • మీ పేరు, ఫోన్ నంబర్ నమోదు చేయాలి. 
  • ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మీ ఫిర్యాదు రిజిస్టర్ అవుతుంది. 

ఇలా చేస్తే వెంటనే ఆ నంబర్ నుంచి వేరొకరికి స్పామ్ మెసేజులు గానీ స్పామ్ కాల్స్ గానీ వెళ్లకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది. మరి మీకు స్పామ్ కాల్స్ గానీ స్పామ్ మెసేజులు గానీ వచ్చాయి అని అనిపిస్తే కనుక వెంటనే చక్షు వెబ్ సైట్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి. ఇక ఎవరూ మోసపోకుండా ఆ నంబర్ బ్లాక్ అవుతుంది. మరి ఈ కథనాన్ని షేర్ చేసి సూపర్ హీరో అవ్వండి. ప్రజలను ఆపద నుంచి రక్షించడమే కాదు.. ఆపద రాకుండా చేయడం కూడా సూపర్ హీరోనే. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి