iDreamPost

Amardeep vs Prashanth: అమర్- ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఒకరిపై ఒకరు సిల్లీ రీజన్స్ చెప్పుకుని బాగానే నామినేట్ చేసుకున్నారు. ఇంక అమర్- ప్రశాంత్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అయితే ఆ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఒకరిపై ఒకరు సిల్లీ రీజన్స్ చెప్పుకుని బాగానే నామినేట్ చేసుకున్నారు. ఇంక అమర్- ప్రశాంత్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అయితే ఆ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

Amardeep vs Prashanth: అమర్- ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆఖరి మజిలీకి చేరుకుంది. హౌస్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారి. వారిలో కేవలం ఒక్కరు మాత్రమే విన్నర్ అవుతారు. వీళ్లల్లో టాప్ 5కి చేరేది ఎవరు? విన్నర్ అయ్యేది? ఎలిమినేట్ అయేది ఎవరు? తెలియాలంటే ఇంకో వారం రోజులు ఆగాల్సింది. ఆ తర్వాత టాప్-5 ఎవరు అన్నది క్లారిటీ వస్తుంది. ఇంక హౌస్ లో నామినేషన్స్ లో ఉండే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ వీక్ లో అయినా సరైన కారణాలతో నామినేషన్స్ చేస్తారు అనుకుంటే అవే తుప్పాస్ రీజన్స్ తో నామినేషన్స్ చేసుకున్నారు. ఎవరూ కూడా సరైన పాయింట్ చెప్పి నామినేట్ చేయలేదు. అవే ఇచ్చి పుచ్చుకునే వాయినాల పర్వం నడిచింది.

ఎప్పటిలాగానే ఒక గ్రూప్ ఇంకో గ్రూపును.. తమ టార్గెట్ సభ్యులను నామినేట్ చేసుకున్నారు. వారిలో ప్రియాంక అమర్ ని నామినేట్ చేయడంపై అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇది కూడా ప్రియాంక స్ట్రాటజీలాగానే అనిపించింది. ఎందుకంటే గత వారం హోస్ట్ నాగార్జున ప్రియాంకను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో ముఖ్యంగా గ్రూప్ గేమ్ గురించి క్వశ్చన్ చేశారు. అందుకే ప్రియాంక ఈసారి అమర్ ని నామినేట్ చేసినట్లు కనిపించింది. అలాగే అమర్ మాటలతో ప్రియాంక ఇబ్బంది పడింది అనే విషయం అందరూ చూశారు. అందుకే నామినేట్ చేసిందని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా అమర్- పల్లవి ప్రశాంత్ మధ్య గట్టిగానే గొడవ జరిగింది.

అమర్ ని ప్రశాంత్ నామినేట్ చేశాడు. అందుకు అమర్ అంతగా సీరియస్ అవ్వలేదు. కానీ, అమర్ నామినేషన్ సమయంలో ప్రశాంత్ పై చాలా సీరియస్ అయ్యాడు. నేను నిన్ను ముట్టక పోతే నువ్వు నామినేట్ చేయవు. నేను నీ పేరు తీస్తే నువ్వు నా పేరు తీస్తావ్ అంటూ అమర్ చెప్పుకొచ్చాడు. ఇంక ప్రశాంత్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. అసలు నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదు. నిన్ను నమ్మితే నాకు నమ్మక ద్రోహం చేశావ్. నమ్మించి మోసం చేశావ్. అసలు నువ్వు నాతో మాట్లాడనే వద్దు. నన్ను రా అని కూడా పిలవకు నన్ను పేరు పెట్టి పిలువు. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నిజానికి ప్రశాంత్ బాధలో అర్థం ఉంది. ప్రశాంత్ ఎంతగానో సపోర్ట్ చేశాడు.

అమర్ మాత్రం ఆ వీక్ లో ప్రశాంత్ ని నామినేట్ చేయడం కరెక్ట్ గా అనిపించలేదు. అదే విషయంలో ప్రశాంత్ కూడా బాధ పడ్డాడు. పాయింట్స్ కూడా అమర్ కి ఇవ్వాలి అనుకున్నాడు. కానీ, అమర్ మాత్రం ఇలా నామనినేట్ చేసేసరికి బాధ పడిపోయాడు. వీళ్ల గొడవ చూస్తే ఇద్దరూ కరెక్ట్ రీజన్స్ తో నామినేట్ చేసుకున్నట్లు అనిపించలేదు. ప్రశాంత్ ది బాధ.. అమర్ ది కోపం ఆ రెండే కనిపించాయి. ఇంక అంత గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. మగాడి మాటలు మాట్లాడు అంటే… మరి నువ్వు ఆడాళ్ల మాటలు మాట్లాడతావా? అన్నాడు. నన్ను ఆడోడు అంటావా అంటూ అమర్ దీప్ నానా రచ్చ చేశాడు. ఇదంతా చూశాక వీళ్లకు బుర్ర ఉందా అనే భావన కలుగుతుంది. మొత్తానికి ఈ గొడవలో ఇద్దరిదీ తప్పే. మరి.. అమర్- ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి