iDreamPost

ఏంది శివాజీ ఇది.. చేస్తానన్న సాయం అడిగితే తప్పా.. ప్రశ్నించొద్దా?

Pallavi Prashanth- Shivaji: పల్లవి ప్రశాంత్ చేస్తానన్న సాయం గురించి నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయితే అలా ప్రశ్నిచడం కరెక్ట్ కాదు అంటూ శివాజీ కామెంట్స్ చేశాడు.

Pallavi Prashanth- Shivaji: పల్లవి ప్రశాంత్ చేస్తానన్న సాయం గురించి నెట్టింట ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయితే అలా ప్రశ్నిచడం కరెక్ట్ కాదు అంటూ శివాజీ కామెంట్స్ చేశాడు.

ఏంది శివాజీ ఇది.. చేస్తానన్న సాయం అడిగితే తప్పా.. ప్రశ్నించొద్దా?

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగుకి ఏ సీజన్ కి రానంత హైప్ వచ్చింది. ఈసారి సీజన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవడమే. అయితే కేవలం విన్నర్ కావడం మాత్రమే కాదు.. షో స్టార్టింగ్ నుంచి మనోడి ఆట, మాటకు అభిమానులు పెరిగిపోయారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు జై జవాన్- జై కిసాన్ అంటూ నినాదాలు చేయడం, సింపథీ డైలాగులతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ షోలో గెలుచుకునే ప్రతి రూపాయి పేద రైతులకు ఖర్చుచేస్తాను అని. ఇప్పుడు అదే విషయాన్ని ప్రశ్నిస్తే శివాజీకి ఇబ్బంది అవుతోంది. అలా ఎలా అడుగుతారు అంటూ కామెంట్స్ చేయడం హాస్యాస్పదంగా అనిపిస్తోంది.

హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ చెప్పిన మాటలు అందరూ చూశారు. తాను గనుక గెలిస్తే ప్రతి రూపాయి పేద రైతులకు ఖర్చు చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. హౌస్ లో ఉన్నప్పుడు, కప్పు తీసుకున్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాడు. అయితే తర్వాత కేసులో అరెస్టు కావడం, బెయిలు మీద బయటకు రావడం చకా చకా జరిగిపోయాయి. ఇంక ఈ సాయం గురించి, పేద రైతుల గురించి ప్రశాంత్ పట్టించుకున్న పాపాన పోలేదు. అదే విషయాన్ని నెటిజన్స్ ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రశాంత్ పెట్టే ప్రతి పోస్ట్, ప్రతి రీల్ కింద ప్రశ్నల వర్షం కురిపించారు. సాయం చేస్తానన్నావ్.. ఏ చేశావ్? అని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.

తాను చేయాలని చేశాడో.. ట్రోలింగ్ దెబ్బకు దిగొచ్చాడో తెలియదు గానీ.. ప్రశాంత్ తన తొలి సాయాన్ని చేశాడు. ఓ పేద కుటుంబానికి రూ.లక్ష సాయం, ఏడాదికి సరిపడా బియ్యం అందించాడు. అలాగే ఆట సందీప్ తన తరఫున రూ.25 వేలు ఆ కుటుంబానికి సాయం చేశాడు. ఆ సాయానికి శివాజీ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా శివాజీ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. “బిగ్ బాస్ నుంచి పల్లవి ప్రశాంత్ కు వచ్చింది రూ.40 లక్షల చిల్లర. దానిలో 40 శాతం ట్యాక్స్ కడితే.. మిగిలేది రూ.20 నుంచి రూ.25 లక్షలు. కేసు, బెయిలు అంటూ వాడికి చాలానే ఖర్చులు అయ్యాయి. ప్రశాంత్ ని ప్రశ్నించినట్లే ఎమ్మెల్యే, ఎంపీలను ప్రశ్నిస్తే బాగుంటుంది. ప్రశాంత్ ని కూడా ప్రశ్నించొచ్చు.. కానీ, వెటకారం- టార్గెట్ చేయడం దేనికి. ఒకవేళ అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అతని అంతరాత్మ ఊరుకుంటుందా? పల్లవి ప్రశాంత్ ని నిలదీయడం కరెక్ట్ కాదు” అంటూ శివాజీ కవర్ చేసే ప్రయత్నాలు చేశారు.

కానీ, ఆయన మాటలతో ప్రశాంత్ ని మరింత ఇరకాడంలో పెట్టాడు. ప్రశాంత్ కు వచ్చింది దాదాపు రూ.25 లక్షలు అని నోరు జారాడు. ఇంకేముంది ఆ డబ్బు సాయంగా అందించాలని ప్రశ్నిస్తారు. అయినా హౌస్ లో ఉన్నన్ని రోజులు అలాంటి మాటలు ఎవరు చెప్పమన్నారు? సంపథీ డ్రామాలు ఎవరు ఆడమన్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఏ కంటెస్టెంట్ ని అడగని ప్రజలు ప్రశాంత్ నే ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ప్రశాంత్ చేస్తాను అని చెప్పాడు కాబట్టి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు. సరే సాయం అయితే స్టార్ట్ చేశాడు కదా.. ఎంత మందికి చేస్తాడో వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రశాంత్ ని ప్రశ్నించడం కరెక్ట్ కాదంటున్న శివాజీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి