కొన్నేళ్ళ క్రితం వరకు రాజేంద్రప్రసాద్ తరహాలో కామెడీ హీరోకు వన్ అండ్ ఓన్లీ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఒకేరకమైన మూస చిత్రాలు చేసి వరస పరాజయాలతో కొంత గ్యాప్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి నాలుగైదు సినిమాల విడుదల నుంచి ఇప్పుడు ఏకంగా ఒకటి రెండు రేంజ్ కు పడిపోయాడు. షూటింగ్ లో ఉన్న బంగారు బుల్లోడు గురించి కనీసం అప్ డేట్స్ కూడా బయటికి రావడం లేదు.
గత ఏడాది ఈ కారణంగానే ట్రాక్ మార్చి మహర్షిలో సపోర్టింగ్ రోల్ తో మెరిసిన అల్లరి నరేష్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇతని కొత్త మూవీ నాంది తాలుకు ఫస్ట్ లుక్ పోస్టర్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా విడుదల చేశారు. ఇది రెగ్యులర్ స్టైల్ లో ఉంటె అంతగా ప్రస్తావించాల్సిన అవసరం ఉండేది కాదు. కాని నాంది అలా లేదు.
లాకప్ లో సంకెళ్ళతో నగ్నంగా రివర్స్ లో వేలాడదీసిన స్టిల్ లో చాలా తీవ్రత కనిపిస్తోంది. మాసిన గెడ్డంతో మొహమంతా రఫ్ నెస్ తో అల్లరి నరేష్ లుక్ చూస్తుంటే ఏదో ప్రయోగం చేస్తున్నట్టే కనిపిస్తోంది. దీని ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నరేష్ ఇప్పటిదాకా అతి తక్కువ సీరియస్ సినిమాలు చేశాడు. ప్రాణం, నేను, సంఘర్షణ, శంబో శివ శంబో అందులో కొన్ని. అయితే ఇవేవి కమర్షియల్ సక్సెస్ కాలేదు. మరి నాంది తనకు బ్రేక్ ఇవ్వడంతో పాటు తనలోని బెస్ట్ యాక్టర్ ని మరోసారి పరిచయం చేస్తుందేమో చూడాలి.
నిన్న బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి లేకపోయినా ఉన్నంతలో కంటెంట్ నే నమ్ముకుని వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి లవ్ టుడే కాగా రెండోది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నాంది, మహర్షి నుంచి పూర్తిగా సీరియస్ టర్న్ తీసుకున్న అల్లరి నరేష్ ట్రై చేసిన మరో సోషల్ మెసేజ్ సబ్జెక్టు ఇది. ప్రమోషన్ల టైం నుంచే ఇందులో కాన్సెప్ట్ ఏంటో దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. సందేశం […]