iDreamPost
android-app
ios-app

ధనుష్- శేఖర్ కమ్ముల సినిమాలో అక్కినేని నాగార్జున!

ధనుష్- శేఖర్ కమ్ముల సినిమాలో అక్కినేని నాగార్జున!

హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ నటించిన తమిళ్ సినిమాలను తెలుగులో కూడా డబ్ అవుతాయి. ఆ సినిమాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ధనుష్ అనగానే.. అంతా రఘువరన్ అనేస్తారు. ఆ సినిమాకి అంత బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయడం ప్రారంభించాడు. ఇటీవల సార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

వెంకటీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా కంటే ముందే ధనుష్.. శేఖర్ కమ్ములతో పాన్ ఇండియా మూవీకి ఓకే చెప్పేశాడు. కానీ, సార్ సినిమా ముందు రిలీజ్ అయింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల చిత్రం కూడా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ధనుష్- శేఖర్ కమ్ముల చిత్రంలో నాగార్జున నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. కానీ, టాలీవుడ్ వర్గాల్లో ఈ వార్త జోరుగా నడుస్తోంది. నాగార్జున ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటించనున్నట్లు చెబుతున్నారు.

అందుకోసం కింగ్ నాగార్జున 20 నుంచి 30 రోజుల డేట్స్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే నాగార్జున ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని చెబుతున్నారు. ఇంక ఈ సినిమా హీరోయిన్ విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే దానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఏమీ లేదు. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మరి ఈ సినిమా ఓకే చెబుతుందో లేదో చూడాలి. ఇప్పటికీ రష్మిక వెంకీ కుడుముల- నితిన్ కాంబో చిత్రాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత మిగిలిన భాషల్లోకి డబ్బ్ చేయనున్నారు. ధనుష్ సినిమాలో అక్కినేని నాగార్జున అనగానే టాలీవుడ్ లోనే కాకుండా.. అటు కోలీవుడ్ లో కూడా హైప్ పెరిగిపోయింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al