iDreamPost

ఎట్టకేలకు OTTలోకి వచ్చేస్తున్న అఖిల్ మూవీ ‘ఏజెంట్’..!

అక్కినేని వారసుడు అఖిల్ తాజా చిత్రం ఏజెంట్. గత ఏడాది ఏప్రిల్ 28న విడుదల అయ్యి.. డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఓటీటీల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి సందడి చేసేందుకు వస్తుంది.

అక్కినేని వారసుడు అఖిల్ తాజా చిత్రం ఏజెంట్. గత ఏడాది ఏప్రిల్ 28న విడుదల అయ్యి.. డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఓటీటీల్లో రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి సందడి చేసేందుకు వస్తుంది.

ఎట్టకేలకు OTTలోకి వచ్చేస్తున్న అఖిల్ మూవీ ‘ఏజెంట్’..!

ఎన్నో అంచనాల నడుమ విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం ఏజెంట్. అక్కినేని వారసుడు అఖిల్ నటించిన ఈ మూవీ.. గత ఏడాది ఏప్రిల్‌లో విడుదలైంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా ఛేంజ్ అయ్యాడు. సిక్స్ ప్యాక్, కండలు పెంచి.. టాలీవుడ్ యంగ్ సల్మాన్‌లా మారిపోయాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై అనిల్ సుంకుర, రామ బ్రహ్మం సుంకర, రెన్నీ జాక్సన్, అజయ్ దీప రెడ్డి సంయుక్తగా నిర్మించారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. 2020లో ఈ సినిమా ఎనౌన్స్ చేయగా.. కోవిడ్, ఇతర కారణాలతో షూటింగ్ వాయిదా పడి.. రిలీజ్ కూడా పోస్టు పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు గత ఏడాది ఏప్రిల్ 28న విడుదలైంది. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కగా.. 10 కోట్లు రూపాయలు కూడా కలెక్ట్ చేయలేకపోయింది.

అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావాల్సి ఉండగా.. లీగల్ ఇష్యూస్ వచ్చాయి. థియేటర్లలోకి వచ్చేందుకు పలుమార్లు వాయిదా పడినట్లే.. ఓటీటీలోకి వస్తున్నట్లు ఎనౌన్స్ చేశాక కూడా పోస్ట్ పోన్ అయ్యింది. ఇప్పటి వరకు ఓటీటీ విడుదలకు నోచుకోలేదు. కానీ అయ్యగారి ఫ్యాన్స్‌కు ఇప్పుడో శుభవార్త రాబోతుంది. త్వరలో సోనీ లివ్‌లో తర్వలో స్ట్రీమింగ్ కానుంది. ఓ సినిమా హిట్టైనా, ఫట్టైనా రెండు నెలల్లోపు థియేటర్లకు రావాల్సిందే. కానీ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఏజెంట్ హక్కులను సోనీలివ్‌కు నిర్మాత అనిల్ సుంకర అమ్ముకున్నాడంటూ ఆరోపించడంతో.. వాయిదా పడుతూ వస్తోంది.

మొత్తానికి ఇప్పుడు ఈ మూవీకి మోక్షం కలిగినట్లు తెలుస్తోంది. జనవరి 26 నుండి సోనీ లివ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే.. ఓటీటీ వెర్షన్‌లో మార్పులు చేశారని సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. సోనీ లివ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. భారీ నష్టాలను చవి చూసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేసేందుకు ముస్తాబైంది. మరీ థియేటర్లలో మిస్ అయ్యామనుకునే వాళ్లు.. ఇక ఎందుకు ఆలస్యం.. ఓటీటీలో రాబోతుంది చూసేయండిక.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి