iDreamPost

లగ్జరీ కారుకొన్న అజింక్యా రహానే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాని ధరెంతో తెలిసిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దాని ధరెంతో తెలిసిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

లగ్జరీ కారుకొన్న అజింక్యా రహానే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

అజింక్యా రహానే.. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి పోరాడుతున్నాడు. సెలెక్టర్లు యంగ్ ప్లేయర్ల వైపు మెుగ్గుచూపడంతో.. రహానేకు జట్టులో ప్లేస్ కరువైంది. పైగా అతడు కూడా ప్రస్తుతం పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. దీంతో మేనేజ్ మెంట్ రహానే వైపు కన్నెత్తి చూడ్డం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సీనియర్ ప్లేయర్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఖరీదైన కారు ధర తెలిస్తే ఔరా..అనాల్సిందే.

టీమిండియా సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ అజింక్యా రహానే ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. ‘మెర్సెడెజ్ మేబాచ్ GSL 600’ కారును కొన్నాడు రహానే. పోలార్ వైట్ కలర్ వేరియంట్ కారును తీసుకున్నాడు. దాని ముందు రహానే, అతడి భార్య రాధిక దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీని ధరెంతో తెలుసా? మెర్సెడెజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 SUV ప్రారంభ ధర రూ. 3.5 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ధర తెలిసి.. అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా అవాక్కౌతున్నారు. కాగా.. సెలబ్రిటీల సర్కిల్ లో ఈ కారు చాలా ఫేమస్. అందుకే ప్రముఖుల ఎక్కువగా ఈ మోడల్ నే ఎన్నుకుంటున్నారు.

ఇక ఈ కారు స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళితే.. 4.0 లీటర్ల బై టర్బో వీ8 ఇంజిన్ తో వస్తుంది. 542BPH, 730NM వరకు పీక్ టార్క్యూను ఇది జనరేట్ చేయగలదు. 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. ఇక దీని వేగం విషయానికి వస్తే.. గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ ను కేవలం 4.9 సెకన్లలోనే అందుకోగలదు. ఈ కారు టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రహానే కెరీర్ దారుణంగా ఉంది. 2023 జులైలో చివరి టెస్ట్ ఆడిన రహానే ఇప్పటి వరకు టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో.. ఈ సీనియర్ ప్లేయర్ వైపు సెలెక్టర్లు కన్నెత్తికూడా చూడ్డంలేదు. పైగా రంజీల్లో పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నాడు. మరి అజింక్యా రహానే లగ్జరీ కారు కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇదికూడా చదవండి: బాబర్ ప్రపంచ రికార్డు.. కోహ్లీకే సాధ్యం కాలేనిది సాధించాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి