iDreamPost

బాబర్ ప్రపంచ రికార్డు.. కోహ్లీకే సాధ్యం కాలేనిది సాధించాడు!

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి సైతం సాధ్యం కాలేదు. మరి ఆ రికార్డు ఏంటో తెలుసుకుందాం పదండి.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి సైతం సాధ్యం కాలేదు. మరి ఆ రికార్డు ఏంటో తెలుసుకుందాం పదండి.

బాబర్ ప్రపంచ రికార్డు.. కోహ్లీకే సాధ్యం కాలేనిది సాధించాడు!

ప్రపంచ క్రికెట్ లో రికార్డుల రారాజు అంటే ఎవరంటే అందరూ దిగ్గజ బ్యాట్స్ మెన్ సచిన్ టెండుల్కర్ అనే చెబుతారు. అయితే మోడ్రన్ క్రికెట్ లో మాత్రం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. మాస్టర్ బ్లస్టర్ సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలుకొడుతూ.. దూసుకెళ్తున్నాడు కింగ్ విరాట్. అయితే టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కే సాధ్యం కాని ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్. మరి కోహ్లీకే సాధ్యం కాని ఆ ఘనతేంటో ఇప్పుడు చూద్దాం.

బాబర్ అజామ్.. వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ టీమ్ దారుణ ప్రదర్శన కారణంగా కెప్టెన్ పగ్గాలను కోల్పోయాడు. ఇక క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ కోహ్లీతో కంపేరిజన్ చేసుకుంటూ.. విమర్శలపాలవుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లీకే సాధ్యం కాని ఓ రికార్డును తన పేరిట లిఖించుకుని ప్రపంచ రికార్డు సృష్టించాడు. బాబర్ అజాయ్ టీ20 క్రికెట్ లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ పొట్టి ఫార్మాట్ లో అత్యంత వేగంగా(ఇన్నింగ్స్ ల పరంగా) 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా తొలి ప్లేయర్ గా నిలిచాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్.

తాజాగా ఇవాళ(ఫిబ్రవరి 21)న కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు ఇంతకు ముందు విండీస్ వీరుడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. అతడు 10 వేల రన్స్ ను పూర్తి చేయడానికి 285 ఇన్నింగ్స్ లు తీసుకుంటే.. బాబర్ 271 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఫీట్ ను సాధించాడు. ఇక పొట్టి ఫార్మాట్ లో ఫాస్ట్ గా 10 వేల రన్స్ పూర్తి చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ(299 మ్యాచ్ ల్లో) మూడో స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి ప్లేసుల్లో డేవిడ్ వార్నర్(303), ఆరోన్ పింఛ్(327) ఉన్నారు. ఇక బాబర్ ఈ మ్యాచ్ లో 51 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 72 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరి బాబర్ సాధించిన ఈ ప్రపంచ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: సిక్సులతో విరుచుకుపడ్డ పంత్‌! యాక్సిడెంట్‌ తర్వాత ఫస్ట్‌ మ్యాచ్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి