చరిత్ర సృష్టించిన ఆఫ్ఘానిస్థాన్! మెగా టోర్నీకి క్వాలిఫై.. మరి ఆ టీమ్‌ సంగతేంటి?

  • Author singhj Published - 12:49 PM, Sat - 4 November 23

క్రికెట్​లో పసికూన చెప్పుకునే ఆఫ్ఘాన్ అరుదైన ఘనత సాధించింది. ఏకంగా మరో మెగా టోర్నీకి క్వాలిఫై అయింది. అయితే ఒక బడా టీమ్ మాత్రం ఆ టోర్నీలో ఇంకా బెర్త్​ను ఫిక్స్ చేసుకోలేదు.

క్రికెట్​లో పసికూన చెప్పుకునే ఆఫ్ఘాన్ అరుదైన ఘనత సాధించింది. ఏకంగా మరో మెగా టోర్నీకి క్వాలిఫై అయింది. అయితే ఒక బడా టీమ్ మాత్రం ఆ టోర్నీలో ఇంకా బెర్త్​ను ఫిక్స్ చేసుకోలేదు.

  • Author singhj Published - 12:49 PM, Sat - 4 November 23

వన్డే క్రికెట్​లో వరల్డ్ కప్ తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా భావించేది ఛాంపియన్స్ ట్రోఫీనే. ఆ మాటకొస్తే క్రికెట్​లో అతిపెద్ద టోర్నమెంట్లలో ఇదొకటి. వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్​కు మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలనేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్లాన్. కానీ కారణాలు ఏంటో తెలియదు గానీ దీన్ని అమలు చేయడంలో ఐసీసీ ఫెయిల్ అయింది. చివరగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. అంతకంటే ముందు 2013లో జరిగిన ఎడిషన్​లో టీమిండియా విన్నర్​గా నిలిచింది. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరగనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. హోస్ట్ కంట్రీ కాబట్టి ఆ దేశం ఈ టోర్నమెంట్​కు ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఎనిమిది జట్లు పోటీపడే ఈ టోర్నీలో ఆడే మిగతా టీమ్స్ ఏంటనే ఇంట్రెస్ట్ అందరిలోనూ కలిగింది. దీనికి సంబంధించి తాజాగా ఐసీసీ బిగ్ అప్​డేట్ ఇచ్చింది. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన టీమ్స్ లిస్ట్ ప్రకటించింది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్​తో పాటు ఆఫ్ఘానిస్థాన్ కూడా ఈ టోర్నీమెంట్​కు క్వాలిఫై అయ్యాయి. మిగిలిన టీమ్స్​ గురించి పక్కన బెడితే ఆఫ్ఘాన్ ఈ టోర్నమెంట్​కు అర్హత సాధించడం సంచలనమనే చెప్పాలి. ఎందుకంటే ఈ లిస్టులో ఉన్న టీమ్స్​లో అన్నీ పెద్ద జట్లే కావడం విశేషం.

వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్​పై విజయం సాధించింది ఆఫ్ఘానిస్థాన్. అన్నీ కలిసొస్తే మెగా టోర్నీలో సెమీస్​కు ఆ టీమ్ దూసుకెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇంగ్లండ్, పాక్​ లాంటి బడా టీమ్స్​ను ఓడించి పసికూన అనే ముద్ర చెరిపేసుకున్న ఆఫ్ఘాన్.. ఏకంగా ఛాంపియన్స్ ట్రోఫీకి నేరుగా క్వాలిఫై అయింది. ఆ టోర్నీకి ఆఫ్ఘాన్ అర్హత సాధించడం ఇదే ఫస్ట్ టైమ్. ఇది ఆ దేశ క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని రోజుగా చెప్పొచ్చు. ఇక, మరో రెండు టీమ్స్​కు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ఛాన్స్ ఉంది. ఆ బెర్త్​ల కోసం శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి.

మెగాటోర్నీ పాయింట్స్ టేబుల్​లో టాప్-7లో నిలిచిన టీమ్స్​కు మాత్రమే ఆ బెర్త్ దక్కుతుంది. ఆడిన 6 మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన ఇంగ్లండ్.. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గితే టాప్-7లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ టీమ్ గనుక ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించకపోతే మాత్రం పరువు పోవడం ఖాయం. ఇంగ్లండ్​తో పాటు లంకకూ మంచి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్, కివీస్​పై నెగ్గితే ఆ టీమ్ అర్హత సాధించగలదు. మరి.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆఫ్ఘాన్ క్వాలిఫై కావడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా ఫ్యూచర్ సేఫ్.. రోహిత్, కోహ్లీని మించి ఆడుతున్న బ్యాటర్!

Show comments