iDreamPost

టీమిండియా ఫ్యూచర్ సేఫ్.. రోహిత్, కోహ్లీని మించి ఆడుతున్న బ్యాటర్!

  • Author singhj Published - 11:45 AM, Sat - 4 November 23

భారత టీమ్ భవిష్యత్తుకు ఢోకా లేదని ఒక యంగ్ ప్లేయర్ భరోసా ఇస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మించి ఆడుతూ తానున్నాను డోంట్ వర్రీ అంటున్నాడు.

భారత టీమ్ భవిష్యత్తుకు ఢోకా లేదని ఒక యంగ్ ప్లేయర్ భరోసా ఇస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మించి ఆడుతూ తానున్నాను డోంట్ వర్రీ అంటున్నాడు.

  • Author singhj Published - 11:45 AM, Sat - 4 November 23
టీమిండియా ఫ్యూచర్ సేఫ్.. రోహిత్, కోహ్లీని మించి ఆడుతున్న బ్యాటర్!

భారత క్రికెట్ టీమ్ ముందెన్నడూ లేనంత ఫామ్​లో ఉంది. వరుసగా ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​లు గెలుచుకున్న రోహిత్ సేన.. వన్డే వరల్డ్ కప్-2023లో తన డామినేషన్ చూపిస్తోంది. ఇప్పటిదాకా మెగా టోర్నీలో ఆడిన ఏడుకు ఏడు మ్యాచుల్లోనూ నెగ్గింది. భారత్​తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఒకప్పుడు క్రికెట్​పై ఆస్ట్రేలియా జట్టు ఎలా ఆధిపత్యం చూపించిందో అదే స్థాయిలో ఇప్పుడు టీమిండియా డామినేషన్ నడుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలోనూ రోహిత్ సేనను ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఇదే ఊపును కంటిన్యూ చేస్తే భారత్ ఒడిలో మూడో ప్రపంచ కప్ వచ్చి చేరడం ఖాయమనే చెప్పాలి.

వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా విజయాల్లో జట్టులోని అందరి పాత్ర ఎంతో కీలకం. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాత్రం ఎక్కువ క్రెడిట్ ఇవ్వక తప్పదు. వీళ్లిద్దరూ భారత బ్యాటింగ్​ యూనిట్​ను ముందుండి నడిపిస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్​కు దిగినా రోహిత్, కోహ్లీల్లో ఎవరో ఒకరు క్రీజులో పాతుకుపోతున్నారు. రోహిత్ ఫెయిలైతే టీమ్​ను విరాట్ ముందుండి నడిపిస్తున్నాడు. ఒకవేళ కోహ్లీ వెనుదిరిగినా హిట్​మ్యాన్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. ఇలా ఇద్దరు సీనియర్ బ్యాటర్లు టీమ్​ విజయాల్లో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. బ్యాటింగ్​లోనే కాదు.. బౌలింగ్ టైమ్​లోనూ బౌలర్లకు కీలక సూచనలు ఇస్తున్నాడు రోహిత్.

ఫీల్డింగ్​లోనూ కెప్టెన్ రోహిత్​కు అవసరమైన టైమ్​లో విరాట్ అండగా ఉంటున్నాడు. బౌలర్లను ఎంకరేజ్ చూస్తున్నాడు కోహ్లీ. ఈ వరల్డ్ కప్​లో కోహ్లీ 442 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్టులో సెకండ్ ప్లేస్​లో ఉన్నాడు. రోహిత్ 402 రన్స్​తో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. వీళ్లిద్దరూ ఇలాగే తమ జోరును కొనసాగిస్తే వరల్డ్ కప్ మనదేనని చెప్పొచ్చు. ఇప్పటిమటుకు రోహిత్, కోహ్లీలు ఉన్నారు సరే.. వీళ్ల తర్వాత భారత టీమ్ ఫ్యూచర్ ఏంటనే ఆలోచనలు మీకూ వచ్చే ఉంటాయి. అయితే టీమిండియా భవిష్యత్తుకు ఓ యువ బ్యాటర్‌‌ భరోసా ఇస్తున్నాడు. అతడే యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్.

భారత టీమ్​లోకి వచ్చిన తక్కువ కాలంలోనే తన ప్లేస్​ను పర్మినెంట్ చేసుకున్నాడు శుబ్​మన్ గిల్. వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ టెస్టులు, వన్డేలు, టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్​గా మారాడు. కెప్టెన్ రోహిత్​తో కలసి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమ్​కు అదిరిపోయే ఓపెనింగ్ పార్ట్​నర్​షిప్స్ అందిస్తున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది గిల్ కావడం విశేషం. గిల్ 1426 రన్స్ చేయగా.. ఆ తర్వాతి ప్లేసులో రోహిత్ (1060 రన్స్), కోహ్లీ (1054 రన్స్) ఉన్నారు. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ డామినేషన్ ఏ లెవల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ యూనిట్​కు వెన్నెముకలా మారిన గిల్​ భారత ఫ్యూచర్ అని క్రికెట్ మాజీలు, అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. టీమిండియా ఫ్యూచర్ గిల్ అని మీరు భావిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే చేస్తున్నా.. అందుకే ఇంత సక్సెస్: షమి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి