iDreamPost

ఎక్కువ భయపెడుతున్న హిట్ 2

  • Published - 01:15 PM, Thu - 3 November 22
ఎక్కువ భయపెడుతున్న హిట్ 2

రెండేళ్ల క్రితం 2020లో వచ్చిన విశ్వక్ సేన్ హిట్ ది ఫస్ట్ కేస్ ఎంత పెద్ద సక్సెసో అందరికీ గుర్తే. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా డాక్టర్ శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా డీసెంట్ బడ్జెట్ లో తీసిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. అంతు చిక్కని ఓ మానసిక వ్యాధితో బాధ పడుతూనే హత్యలకు సంబంధించిన కేసులను ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ గా విశ్వక్ పెర్ఫార్మన్స్ తో పాటు డైరెక్టర్ టేకింగ్ కు మంచి పేరు వచ్చింది. హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా ఇదే శైలేష్ తో ముగ్గురు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు నిర్మిస్తే అక్కడ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు దీనికి కొనసాగింపు వస్తోంది. హిట్ ది సెకండ్ కేస్ పేరుతో పూర్తిగా కొత్త క్యాస్టింగ్ తో తీశారు శైలేష్.

Adivi Sesh's HIT 2 teaser out. Film to release on December 2, confirms Nani - India Today

మాములుగా క్రైమ్ మూవీస్ లో ఒక కామన్ ప్యాట్రన్ ఉంటుంది. హిట్ 2(HIT 2)లోనూ అదే ఫాలో అయ్యారు. ఒక యారొగెంట్ పోలీస్ ఆఫీసర్. సూటిగా మాట్లాడేస్తాడు. పై అధికారులు నోటి దూలని చెప్పినా పట్టించుకోడు. ఏదో చిన్న చిన్న కేసులతో కాలం గడుపుతున్న టైంలో ఒక బార్ లో జరిగిన హత్య గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పాట్ కు వెళ్తాడు. ఎన్నో మర్డర్లను చూసిన అతని కళ్ళు అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి ఒళ్ళు జలదరించేలా భయపెడతాయి. ఒక అందమైన అమ్మాయి శరీరం ముక్కలుగా వేరుచేయబడి ఒక బొమ్మను సెట్ చేసినట్టు నేలపై పడుకుని పెడతాడు హంతకుడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన కిల్లర్ ఎవరనేది హిట్ 2 సెకండ్ కేస్ స్టోరీ.

Adivi Sesh's 'HIT-2': Teaser release date is here! - Telugu News - IndiaGlitz.com

శైలేష్ కొలను ఈసారి ఇంటెన్సిటీ తీవ్రంగా ఉన్న ప్లాట్ ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా చివర్లో వచ్చే విజువల్స్ డిస్ట్రబ్డ్ గా ఉండటంతో సున్నిత మనస్కులకు ఇబ్బంది అనిపించే విధంగా టెర్రర్ చూపించాడు. చేసింది సైకో కిల్లరా లేక హిట్ 1 తరహాలో ఎవరూ ఉహించని సస్పెన్స్ ట్విస్టు ఉంటుందా అనేది తెరమీద చూడాలి. డిసెంబర్ 2 విడుదల కాబోతున్న హిట్ 2 మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మేజర్ ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత అడవి శేష్ చేసిన సినిమా కావడంతో మారిన ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని కీలక మార్పులు చేశారని తెలిసింది. దీన్ని మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో నాని ఉన్నారు. మొత్తానికి హిట్ గురి కుదిరింది.