iDreamPost

ఎన్నికల ఫలితాలు.. ఒక్క రోజులో లక్షల కోట్లు నష్టపోయిన అదానీ, అంబానీ!

Huge Loss To Adani, Ambani: ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్ లో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కరోజులో అదానీ, అంబానీకి చెందిన సంస్థలు లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయి.

Huge Loss To Adani, Ambani: ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్ లో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కరోజులో అదానీ, అంబానీకి చెందిన సంస్థలు లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయి.

ఎన్నికల ఫలితాలు.. ఒక్క రోజులో లక్షల కోట్లు నష్టపోయిన అదానీ, అంబానీ!

లోక్ సభ ఎన్నికల ఫలితాల వేళ ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. పలుచోట్ల ఎన్డీఏ, ఇండియా కూటమి నెక్ టూ నెక్ పోటీ పడుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల ముందు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే జూన్ 4 ఫలితాల తర్వాత భారీ లాభాలు ఉంటాయని అనుకున్నారు. బీజేపీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని కూడా అంచనా వేశారు. అదే జరిగితే స్టాక్ మార్కెట్ మరింత దూసుకుపోతుందని అన్నారు. కానీ అంచనాలకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ కి విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు ఉండడంతో స్టాక్ మార్కెట్ పతనమవుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెన్సెక్స్ 4053.71 పాయింట్ల వద్ద 4053.71 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 1290.20 పాయింట్లు పతనమై 21,973.70 వద్ద కొనసాగుతోంది.

వారణాసిలో మోదీ వెనుకంజలో ఉన్నారనగానే చాలా మంది డీలా పడ్డారు. మోదీ విజయం కష్టమే అని ట్రేడర్లు, ఇన్వెస్టర్లు భావించినా పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ, దాని అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ షేర్లు పతనమవుతున్నాయి. బీఎస్ఈ డేటా ప్రకారం.. అదానీ టోటల్ గ్యాస్ 14.80 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 18.22 శాతం, అదానీ పోర్ట్స్ 19.35 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 17.55 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 16.66 శాతం క్షీణించాయి. అదానీ విల్మార్ 8.78 శాతం, అదానీ పవర్ 14.96 శాతం తగ్గింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7.21 శాతం క్షీణించాయి. జియో ఫైనాన్షియల్ 5.59 శాతం తగ్గగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన డీఈఎన్ నెట్వర్క్ 7.14 శాతం క్షీణించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మెజారిటీ వాటా కలిగిన హాత్వే కేబుల్ 6.21 శాతం క్షీణించగా.. జస్ట్ డయల్ 5.77 శాతం క్షీణించింది. ట్రేడింగ్ సెషన్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 273.10 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకాయి. మార్కెట్ క్యాప్ ప్రకారం.. ఇవాళ ఇంట్రాడే పతనంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 2 లక్షల కోట్లు నష్టపోయింది. అదానీ గ్రూప్ కంపెనీలు కూడా భారీగా నష్టపోయాయి. ట్రేడింగ్ సెషన్ లో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ నుంచి 2,57,453.5 కోట్లను నష్టపోయింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్ క్యాప్ ట్రేడింగ్ సెషన్ లో 41,530.79 కోట్లు క్షీణించింది. మొత్తానికి ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్ లో అదానీ, అంబానీల కంపెనీలకు లక్షల కోట్లలో నష్టమైతే వాటిల్లింది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి