iDreamPost

ఈమె ఓ స్టార్ హీరో భార్య.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఓ రేంజ్‌లో! గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో సెగలు పుట్టించే అవుట్ ఫిట్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ స్టార్ హీరోయిన్ భార్య. సమ్మర్ లో మరింత సెగలు పుట్టిస్తున్న ఈమె హీరోయిన్ కూడా . ఇంతకు ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో సెగలు పుట్టించే అవుట్ ఫిట్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ ప్రముఖ స్టార్ హీరోయిన్ భార్య. సమ్మర్ లో మరింత సెగలు పుట్టిస్తున్న ఈమె హీరోయిన్ కూడా . ఇంతకు ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈమె ఓ స్టార్ హీరో భార్య.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఓ రేంజ్‌లో! గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ గురించి చెప్పాలంటే.. ఆమె ఓ స్టార్ హీరోయిన్. కాదూ కాదూ సాధారణ గృహిణి. కాస్ట్యూమ్ అండ్ ప్యాషన్ డిజైనర్, నో నో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిజైనర్, ఆర్గనైజర్, మోటివేటర్, ఇన్ఫ్లుయెన్సర్.. మల్టీ టాలెంటర్. ఆమె భర్త కూడా స్టార్ నటుడే. నేటి మహిళలకు ఆ నటి ఒక రోల్ మోడల్ కూడా. ఆమెలో తెలియని సింగర్ కూడా దాగి ఉంది. అంతేకాదు.. చైల్డ్ ఆర్టిస్టుగాను అలరించి.. మలయాళం మినహా మిగిలిన దక్షిణాది ఇండస్ట్రీలో వర్క్ చేసింది. హీరోయిన్ అయినప్పటికీ..ఆర్థిక కష్టాలను చూసింది. బడ్జెట్ ఫ్రెండ్లీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. రోడ్ సైడ్ షాపింగ్, న్యూమాయిష్ వంటి ఎగ్జిబిషన్‌లో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం దగ్గర నుండి ఆన్ లైన్‌లో తక్కువ బడ్జెట్‌లో దొరికే క్వాలిటీతో కూడిన దుస్తులు కొనుగోలు చేస్తుంది.

మొత్తానికి ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే ఇల్లాలిగా మంచి మార్కులు వేయించుకుంది ఈ పదాహరణాల తెలుగు నటి. బిగ్ బాస్‌లో భర్తతో కలిసి ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో ఏర్పడ్డ చిలిపి తగాదాలు, సరదాలతో వారి బాండింగ్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. సినిమాలు చేస్తూనే మూడేళ్ల క్రితం యూట్యూబర్‌గా మారి.. అదరగొడుతోంది. అవకాశాలు లేవని చింతించకుండా.. తనను తాను ఫ్రూవ్ చేసుకుంటుంది. ఇంతకు ఆ నటి ఎవరంటే..వితిక శేరు. ఆమె భర్త మనకు బాగా తెలిసిన హీరో.. హ్యాపీడేస్‌తో యువతను తన వైపు తిప్పుకున్న వరుణ్ సందేశ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వితికా తన గ్లామరస్ లుక్స్‌తో కట్టిపడేస్తోంది. గతం కంటే మరింత అందంగా, క్రేజీ అవుట్ ఫిట్‌తో చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోలు చూస్తే నిర్మాతలు కాల్షీట్ల కోసం కాల్ చేయడం ఖాయం. అంత హాట్ అండ్ మెస్మరైజ్ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. ఈ ఫోటో షూట్ పిక్స్ చూస్తే రీ ఎంట్రీ ఫిక్సేమో అనిపించకమానదు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. భీమవరానికి చెందిన వితిక శేరు.. చైల్డ్ ఆర్టిస్టుగా పలు ధారావాహికల్లో కనిపించింది. 15 ఏళ్లకే హీరోయిన్ అయిపోయింది. తెలుగు అమ్మయైన.. కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రేమించే రోజుల్లో మూవీతో టీటౌన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే కీర్తి అనే పేరును మార్చుకుంది. ఆ తర్వాత మళ్లీ వితికా పేరుతోనే ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరీ వంటి చిత్రాల్లో నటించింది. పడ్డానండి ప్రేమలో మరీ అనే చిత్రంతోనే వరుణ్, వితిక ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మహా బలిపురం తమిళ చిత్రంలో నటించింది.

2019లో బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొంది ఈ జంట. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. యూట్యూబర్‌గా ఆకట్టుకుంటుంది. పెళ్లి సందడి చిత్రంలో శ్రీలీల అక్కగా మెస్మరైజ్ చేసింది ఈ అమ్మాయి. ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. కుర్రాడు, మరో చరిత్ర, హ్యపీ హ్యపీగా, ఏమైంది ఈ వేళ, సరదాగా అమ్మాయితో, ఈ వర్షం సాక్షిగా, మైఖేల్ వంటి చిత్రాల్లో అలరించాడు. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి