iDreamPost
android-app
ios-app

స్టార్ హీరో సరసన ఛాన్స్.. శ్రీలీల ప్లేస్ లోకి ఏజెంట్ భామ..?

  • Author ajaykrishna Published - 06:42 PM, Sat - 28 October 23

క్రేజీ కాంబినేషన్ లో అనౌన్స్ మెంట్ జరిగిన సినిమాలో శ్రీలీల స్థానాన్ని ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ శ్రీలీల ఓకే చేసిన సినిమా ఏంటి? ఆమె స్థానంలో సాక్షి ఎలా వస్తోంది? అనే వివరాల్లోకి వెళ్దాం.

క్రేజీ కాంబినేషన్ లో అనౌన్స్ మెంట్ జరిగిన సినిమాలో శ్రీలీల స్థానాన్ని ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ శ్రీలీల ఓకే చేసిన సినిమా ఏంటి? ఆమె స్థానంలో సాక్షి ఎలా వస్తోంది? అనే వివరాల్లోకి వెళ్దాం.

  • Author ajaykrishna Published - 06:42 PM, Sat - 28 October 23
స్టార్ హీరో సరసన ఛాన్స్.. శ్రీలీల ప్లేస్ లోకి ఏజెంట్ భామ..?

ఇండస్ట్రీలో సినిమాలకు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యాక తీరా సెట్స్ పైకి వెళ్లే టైమ్ లో కూడా మార్పులు జరుగుతుంటాయి. దాదాపు హీరో మారడు గానీ.. హీరోయిన్స్.. మిగతా కాస్ట్ అందరు మారిపోతుంటారు. టాలీవుడ్ లో ఈ మధ్య హీరోయిన్స్ ఎక్కువగా చేంజ్ అవుతుండటం చూస్తున్నాం. ఆ మధ్య గుంటూరు కారంలో పూజ వెళ్లి.. శ్రీలీల ఎంటర్ అయ్యింది. అలాగే డీజే టిల్లులో కూడా ముందు వేరే పేర్లు వినిపించినా ఆఖరికి అనుపమ ఫైనల్ అయ్యింది. ఇలా చూసుకుంటే లిస్ట్ పెద్దగానే ఉంది. అయితే.. గుంటూరు కారంలో పూజ స్థానాన్ని ఎలాగైతే శ్రీలీల భర్తీ చేసిందో.. ఇప్పుడు అదే సీన్ శ్రీలీల విషయంలోనే రిపీట్ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. క్రేజీ కాంబినేషన్ లో అనౌన్స్ మెంట్ జరిగిన సినిమాలో శ్రీలీల స్థానాన్ని ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య భర్తీ చేయనున్నట్లు సమాచారం. అదేంటి గుంటూరు కారంలో శ్రీలీల పూజ స్థానంలోకి వస్తే.. ఇప్పుడు శ్రీలీల స్థానంలో ఇంకో హీరోయిన్ రావడం ఏంటని మీకు డౌట్ రావచ్చు. బట్.. శ్రీలీల ప్రెజెంట్ ఉన్న హీరోయిన్స్ లో ఎంత బిజీ ఆర్టిస్ట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతినిండా దాదాపు పది సినిమాల వరకు లైనప్ చేసి పెట్టుకుంది. ఒక్కో సినిమాని కంప్లీట్ చేస్తూ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ వైపు అడుగులు వేస్తోంది. ఇంతకీ శ్రీలీల ఓకే చేసిన సినిమా ఏంటి? ఆమె స్థానంలో సాక్షి ఎలా వస్తోంది? అనే వివరాల్లోకి వెళ్దాం.

శ్రీలీల గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్, ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాలు చేస్తూనే మరికొన్ని లైనప్ చేసింది. అలా లైనప్ చేసిన సినిమాలలో విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఒకటి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ బిగ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. శ్రీలీలను హీరోయిన్ గా మొన్న మ్యాడ్ ఈవెంట్ లో కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ.. అసలు విషయం ఏంటంటే.. విజయ్ పరశురామ్ డైరెక్షన్ లో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కారణంగా శ్రీలీలతో సినిమా లేటు అవుతుందట. పైగా డిసెంబర్ లో శ్రీలీల ఎంబిబిఎస్ ఎగ్జామ్స్ కోసం బ్రేక్ తీసుకోబోతుంది. అలాగే జనవరి తర్వాత శ్రీలీల డేట్స్ దొరికే ఛాన్స్ లేదట. సో.. శ్రీలీల ముందే చెప్పడంతో సాక్షిని మేకర్స్ కన్ఫర్మ్ చేశారని టాక్. త్వరలో అధికారిక ప్రకటన రానుందట. ఇక రెండు ప్లాప్స్ (ఏజెంట్, గాండీవధారి అర్జున) పడినా సాక్షికి అవకాశాలు వస్తున్నాయంటే లక్ ఉన్నట్లే. మరి సాక్షి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş