iDreamPost

విడాకులు తీసుకోవడంలో తప్పులేదు.. హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్

  • Published Jun 17, 2024 | 7:17 PMUpdated Jun 17, 2024 | 7:17 PM

Sadha: టాలీవుడ్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్ వన్నే తగ్గని అందంతో యంగ్ హీరోయిన్ లకు పోటీ ఇస్తుంది. కానీ,ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఇదే విషయం పై తాజాగా స్పందించిన ఈ బ్యూటీ తన పెళ్లిపై అలాగే విడాకుల విషయం పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Sadha: టాలీవుడ్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్ వన్నే తగ్గని అందంతో యంగ్ హీరోయిన్ లకు పోటీ ఇస్తుంది. కానీ,ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఇదే విషయం పై తాజాగా స్పందించిన ఈ బ్యూటీ తన పెళ్లిపై అలాగే విడాకుల విషయం పై పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.

  • Published Jun 17, 2024 | 7:17 PMUpdated Jun 17, 2024 | 7:17 PM
విడాకులు తీసుకోవడంలో తప్పులేదు.. హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ ‘సదా’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె మొదటిగా ‘జయం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కాగా, ఈ సినిమాను దర్శకుడు తేజ తెరకెక్కించిగా.. ఇందులో నితిన్, సదా హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే అప్పటిలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాలో నటించిన సదా కూడా తన నటనతో,అందంతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.

పైగా ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో ఈ అమ్మడికి వరుస అవకాశాలతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతతో ప్రేక్షకులను మెప్పించింది సదా. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలా అందరీ సరసన నటించి స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా తన పెళ్లి గురించి స్పందించిన ఈ బ్యూటీ విడాకులు తీసుకోవడం తప్పేమీ కాదంటూ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి ఫేమ్ ను సంపాదించుకున్ సదా ఆ తర్వాత కాలంలో ఆఫర్స్ తగ్గి ఇండస్ట్రీలో కనుమరగైంది. ఇక సినిమాల్లో అలరించకపోయినా ఈ బ్యూటీ పలు టీవీ షోల్లో మెరిస్తుంది. ఇకపోతే వయసు పెరుగుతున్న వన్నే తగ్గని అందంతో ఈ బ్యూటీ యంగ్ హీరోయిన్ లకు పోటీగా నిలుస్తుంది.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఇంత వరకు సదా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. అయితే తాజాగా తన పెళ్లి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయడంతో పాటు విడాకులు తీసుకోవడం తప్పులేదంటుంది సదా. ఈ సందర్భంగా సదా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను. ఇక నాకు నచ్చినట్టు పనిచేసుకుంటున్నాను. పైగా ఈ ఫ్రీడమ్ ను నేను పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే.. ఇప్పటివరకు నాకు నచ్చిన వ్యక్తి దొరకలేదు. ఇక పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్ కూడా కలగలేదు.

అయితే అరేంజ్డ్ మ్యారేజ్ కాన్సెప్ట్ కి నేను వ్యతిరేకని. ఎందుకంటే.. పరిచయం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు.? ఎలా కలిసి ఉంటారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే.. లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. నా పేరెంట్స్ ది కూడా లవ్ మ్యారేజ్ అని తెలిపింది. అలాగే నేను పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్‌ సాగడం కష్టంగా ఉందని భావిస్తే.. పార్టనర్‌తో జర్నీ చాలా కష్టంగా అనిపిస్తే, కచ్చితంగా విడాకులు తీసుకుంటా అందులో తప్పేమీ లేదంటూ’ షాకింగ్ కామెంట్స్ చేసింది సదా. ప్రస్తుతం సదా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి, పెళ్లి, విడాకుల పై సదా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి