iDreamPost

RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!

  • Author Soma Sekhar Published - 09:07 PM, Sat - 30 September 23
  • Author Soma Sekhar Published - 09:07 PM, Sat - 30 September 23
RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!

ఇండస్ట్రీకి నటీ, నటుల వారసులు రావడం కొత్తేమీ కాదు. ఇక ఇప్పటికే ఎంతో మంది నట వారసులు పరిశ్రమలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు కూడా. హీరోల వారసులే కాదు.. స్టార్ హీరోయిన్ ల కూతుర్లు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కోవలోకి రాబోతోంది ఓ స్టార్ హీరోయిన్ కూతురు. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆమె కూతురు ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ 16వ ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ అభిమానులను ఆకర్షిస్తోంది. అదేంటంటే? ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ కూతురు నటిస్తోందట. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రవీనా టాండన్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా ఉన్నారు.

ఇప్పుడు ఆమె కూతురు రాషా థడానీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైంది. ఇప్పటికే ఓ హిందీ ప్రాజెక్ట్ ను ఓకే చేసిన ఈ చిన్నది.. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా కోసం రాషాను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదీకాక ఆమె శుక్రవారం హైదరాబాద్ వచ్చినట్లు పలు వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఆమె లుక్ టెస్ట్ కోసమే ఇక్కడికి వచ్చారని గుసగుసలు వినపడుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియరానున్నాయి. కాగా.. ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కబోతోందని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక రాషా థడానీని చూసిన చరణ్ ఫ్యాన్స్ ఆమె క్యూట్ గా ఉంది.. హీరోయిన్ గా ఆమె కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి