iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్ చెప్పబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి! పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Updated - 10:32 AM, Mon - 28 August 23
  • Author ajaykrishna Updated - 10:32 AM, Mon - 28 August 23
గుడ్ న్యూస్ చెప్పబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి! పోస్ట్ వైరల్!

సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి విషయలైనా ఇంటరెస్టింగ్ ఉంటాయంటారు అభిమానులు. ఎందుకంటే.. అభిమాన తారల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఫ్యాన్స్ కి ఇంటరెస్ట్ కి తగ్గట్టుగానే కొంతమంది సెలబ్రిటీలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్డేట్స్ షేర్ చేస్తుంటారు. కానీ.. ఒక్కోసారి వాళ్ళు షేర్ చేసే అప్డేట్స్ సర్ప్రైజ్ చేయవచ్చు లేదా షాకింగ్ గా కూడా అనిపించవచ్చు. ప్రస్తుతం తన ఫ్యాన్స్ కి అలాంటి సర్ప్రైజ్ లు, షాకులు ఇస్తోంది నటి జ్యోతిరాయ్. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో జగతి క్యారెక్టర్ ద్వారా తెలుగులో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.

సీరియల్ లో తల్లి క్యారెక్టర్ చేస్తున్నప్పటికి.. బయట రియల్ లైఫ్ లో చాలా మోడరన్ అండ్ గ్లామరస్ బ్యూటీగా ట్రెండ్ సృష్టిస్తోంది. సీరియల్ లో క్యారెక్టర్ కి పూర్తిగా భిన్నంగా.. నెక్స్ట్ లెవెల్ అందాల షో చేస్తోంది జ్యోతి. ఆ గ్లామర్ తో పాటు అప్పుడప్పుడు ఓ వ్యక్తితో కలిసి క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. ఝలక్ లిస్తుంటుంది. దాదాపు పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న జ్యోతి.. ఓవైపు సీరియల్స్ చేస్తూనే.. మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. జ్యోతికి ఇరవైఏళ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి జరిగింది. వారి కాపురానికి ఫలితంగా ఓ బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత ఏమైందో గానీ భర్తతో విడిపోయి.. సోలోగా ఉంటోంది.

కట్ చేస్తే.. కొన్నాళ్ళుగా జ్యోతి.. సుకు పూర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్ తో క్లోజ్ గా ఉంటోంది. బహుశా అతనితో రిలేషన్ షిప్ లో ఉంది కావచ్చు. ఆ రిలేషన్ ఎలాంటిదో తెలియదు. కానీ.. ఫోటోలలో వారు సన్నిహితంగా ఉండటం చూస్తే.. ఖచ్చితంగా సందేహాలు రాకమానవు. సుకు పూర్వాజ్ డైరెక్షన్ లోనే జ్యోతి ప్రస్తుతం ఓ సినిమా, వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. అతనితో కలిసి ఫోటోలు పెట్టడమే కాకుండా.. ఏకంగా తన పేరులో అతని పేరు కూడా చేర్చుకునే సరికి వీరి మధ్య రిలేషన్స్ రూమర్స్ కాదని అర్ధమవుతుంది. తాజాగా అతనితో కలిసి ఉన్న పిక్ పెట్టి.. త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అని రాసుకొచ్చింది. దీంతో ఆ గుడ్ న్యూస్ దేని గురించి అయ్యుంటుంది అని ఆరాలు తీస్తున్నారు జనాలు. మరి జ్యోతి ఎలాంటి న్యూస్ చెప్పబోతుందో చూడాలి. జ్యోతి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial)