iDreamPost

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అంజలి!

Anjali Comments on Marriage: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అన్నీ నాకు అలా తెలిసిపోతాయ్ అంటూ అమాయకంగా డైలాగ్స్ కొడుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన నటి అంజలి ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉంది.

Anjali Comments on Marriage: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అన్నీ నాకు అలా తెలిసిపోతాయ్ అంటూ అమాయకంగా డైలాగ్స్ కొడుతూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన నటి అంజలి ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉంది.

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి అంజలి!

తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో నటి అంజలి ఒకరు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కు చెందిన అంజలి మ్యాథ్స్ లో డిగ్రీ చేస్తూనే షార్ట్ ఫలిమ్స్, మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీవైపు అడుగులు వేసింది. తెలుగు అమ్మాయి అయినా .. ఫస్ట్ ఛాన్స్ తమిళంలో వచ్చింది. తెలుగులో ఫోటో, ప్రేమలేఖ రాశా లో ఛాన్స్ వచ్చినా పెద్దగా పేరు తీసుకురాలేదు. ‘షాపింగ్ మాల్’ మూవీలో లోకల్ అమ్మాయిగా నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మురగదాస్ తెరకెక్కించిన ‘జర్నీ’ ఆమె నట జీవితాన్ని మార్చేసింది. తాజాగా ఓ ఈవెంట్ లో అంజలి షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2011 లో వెంకటేష్, మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో సీత పాత్రలో నటించిన అంజలి అచ్చం మన ఇంట్లో ఓ అమ్మాయిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. ‘అదేంటో నాకు అలా అన్నీ తెలిసిపోతాయి’ అంటూ అమాయకంగా చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రం తర్వాత అంజలికి హీరోయిన్ గా వరుస ఛాన్సులు వచ్చాయి. ప్రస్తుతం  తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి మెప్పించింది. ఇటీవల అంజలి పలు హర్రర్ జోనర్ లో ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటుంది.

Anjali

అంజలి ద్విపాత్రాభియంలో నటించి హర్రర్ మూవీ ‘గీతాంజలి’ అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రం సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టేటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అంజలి తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై స్పందించింది. ఈ సందర్బంగా సంచలన కామెంట్స్ చేసింది. ‘ఇప్పటి వరకు మీడియాలో నాకు తెలియకుండానే నాలుగు పెళ్లిళ్లు చేశారు. మళ్లీ ఐదోసారి కూడా చేస్తున్నారు. నా వస్తున్న వార్తలు నేనూ కూడా చదివాను.. ఆ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఒట్టి ఫేక్ న్యూస్. నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అప్పుడు పబ్లిక్ గానే తెలియజేస్తా.. దీనికి కాస్త టైమ్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. గీతాంజలి మళ్లీ వచ్చింది ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి