iDreamPost
android-app
ios-app

లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా జరిగింది.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

  • Author Soma Sekhar Published - 05:31 PM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Published - 05:31 PM, Sat - 19 August 23
లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా జరిగింది.. జగపతిబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

సాధారణంగా సెలబ్రిటీలు షుటింగ్స్ కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు చేస్తుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో దేశ విదేశాలు తిరాగాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే వారు విమాన ప్రయాణాలు చేయడం తప్పనిసరి. ఇక చాలా మంది నటీ, నటులు విమానాల్లో కూర్చున్న ఫొటోలను తీసి, జర్నీలోని తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి అనుభవాన్నే పంచుకున్నాడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ జగపతిబాబు. ఎన్నో సార్లు ఫ్లైట్ జర్నీ చేసినప్పటికీ ఈ ఫ్లైట్ జర్నీ ఇలా ఫస్ట్ టైమ్ అంటూ తన అనుభవాన్ని ట్విట్టర్ వేదిగకా పంచుకున్నాడు. మరి జగ్గూ భాయ్ పంచుకున్న అనుభవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జగపతిబాబు.. ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే వయసు పైబడుతన్న కొద్ది హీరో వేశాలు తగ్గించేశాడు. లెజెండ్ మూవీ కోసం విలన్ అవతారం ఎత్తిన జగ్గూ భాయ్.. ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ విలన్ ఇన్ టాలీవుడ్ గా తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తూ.. తెగ బిజీగా ఉన్నాడు జగ్గూ భాయ్. కాగా.. సోషల్ మీడియాలో కూడా జగపతిబాబు ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. తనదైన పోస్ట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు జగపతిబాబు. ఈ పోస్ట్ లో తన విమాన ప్రయాణ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? విశేషమే ఉందని చెప్పుకొచ్చాడు జగ్గూ భాయ్.”నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ ఫస్ట్ ప్యాసింజర్ గా విమానం ఎక్కడం. ఈ టైమ్ లో నాకు బాగా నచ్చిన, త్రివిక్రమ్ ఓ సినిమాలో రాసిన డైలాగ్.. విమానం ఎగురుతుంది. నువ్వు కాదు.. నువ్వు సీట్ లో కూర్చున్నావ్ అంతే!” అంటూ డైలాగ్ ను పోస్ట్ లో రాసుకొచ్చాడు. ఒకే ఒక్క డైలాగ్ తో త్రివిక్రమ్ లైఫ్ అంటే ఏంటో చెప్పాడు అంటూ జగపతిబాబు పేర్కొన్నాడు.


ఇదికూడా చదవండి: వీడియో: బోరున ఏడ్చేస్తూ అనసూయ షాకింగ్ పోస్ట్! ఏమైందంటే?

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet