iDreamPost

రాజకీయాల్లోకి సీనియర్ హీరో రీఎంట్రీ.. ఏ పార్టీలో చేరారంటే..?

  • Published Mar 28, 2024 | 9:19 PMUpdated Mar 28, 2024 | 9:19 PM

పాలిటిక్స్​లోకి రీఎంట్రీ ఇచ్చారో సీనియర్ హీరో. ఒకప్పుడు ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆ నటుడు.. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎవరా హీరో? తాజాగా ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలిటిక్స్​లోకి రీఎంట్రీ ఇచ్చారో సీనియర్ హీరో. ఒకప్పుడు ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆ నటుడు.. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎవరా హీరో? తాజాగా ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 28, 2024 | 9:19 PMUpdated Mar 28, 2024 | 9:19 PM
రాజకీయాల్లోకి సీనియర్ హీరో రీఎంట్రీ.. ఏ పార్టీలో చేరారంటే..?

రాజకీయాల్లోకి సినీ తారలు అడుగుపెట్టడం ఎప్పటి నుంచో వస్తోంది. ఎన్టీఆర్, ఎంజీఆర్ దగ్గర నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, కమల్ హాసన్ వరకు ఎందరో ఫిల్మ్ స్టార్స్ పాలిటిక్స్​లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొందరు మాత్రమే సక్సెస్​ఫుల్ పొలిటీషియన్స్​గా, లీడర్స్​గా పేరు తెచ్చుకున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత సీఎం పదవిని కూడా అధిష్టించారు. చిత్ర పరిశ్రమకు చెందిన మరికొందరు ప్రముఖులు ఎంపీలుగా, మంత్రులుగా కూడా సేవలు అందించారు. ఇలాగే ఇప్పుడో సీనియర్ హీరో పాలిటిక్స్​లోకి విచ్చేశారు. అయితే ఆయనకు రాజకీయాలు కొత్త కాదు. అప్పట్లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పక్కకు జరిగారు. ఇన్నాళ్లకు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా.

బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్​లోకి అడుగుపెట్టారు. లోక్​సభ ఎలక్షన్స్​కు ముందు మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో ఆయన చేరారు. శివసేన ఆఫీసులో గోవిందాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏక్​నాథ్ షిండే. పార్లమెంటు ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి గోవిందా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఇటీవల ఏక్​నాథ్ షిండేతో గోవిందా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో సీనియర్ హీరో మళ్లీ రాజకీయాల్లోకి రావడం పక్కా అని ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా పార్టీలో చేరారు గోవిందా. తాను మళ్లీ పాలిటిక్స్​లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు.

14 ఏళ్ల సుదీర్ఘ వనవాసం అనంతరం రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చానని గోవిందా తెలిపారు. ఏక్​నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముంబై మరింత అందంగా, డెవలప్డ్ సిటీగా మారందని మెచ్చుకున్నారు. తనకు ఛాన్స్ ఇస్తే కళా, సాంస్కృతిక రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని గోవిందా వివరించారు. ఇక, 90వ దశకంలో బాలీవుడ్​లో వరుస సూపర్ హిట్స్​తో దుమ్మురేపారు గోవిందా. ఎక్కువగా కామెడీ సినిమాల్లో యాక్ట్ చేస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. అదే టైమ్​లో స్టైలిష్ డ్యాన్సులతోనూ అదరగొట్టారు. కాగా, 2004లో లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ముంబై నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు గోవిందా. అయితే 2009 తర్వాత ఆయన పాలిటిక్స్​కు గుడ్​బై చెప్పారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు.

ఇదీ చదవండి: త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి